Begin typing your search above and press return to search.
క్రూయిజ్ డ్రగ్స్ కేసు నీరు గారి పోయినట్లేనా ?
By: Tupaki Desk | 6 Nov 2021 9:34 AM GMTప్రముఖ నటుడు షారూక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ పట్టుబడిన క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసు నీరుగారిపోయినట్లేనా ? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఆర్యన్ పట్టుబడినప్పటి నుండి కేసులో అనేక మలుపులు తిరుగుతున్నది. కేసు దర్యాప్తు ఒకడుగు ముందుకేస్తే నాలుగడుగులు వెనక్కు అన్నట్లుగా దర్యాప్తు జరుగుతోంది. డ్రగ్స్ వాడుతు, దగ్గర పెట్టుకుని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులకు ఆర్యన్ అండ్ కో దొరికిన ఘటన స్ధానంలో సంబంధంలేని అనేక అంశాలు చాలా కీలకమైపోయాయి ఇపుడు.
ఆర్యన్ తో పాటు అర్బాజ్ ఖాన్ తదితరులను అరెస్టుచేసిన రెండు రోజుల నుండి కేసుతో సంబంధంలేని అనేక అంశాలు సంచలనాలుగా మారాయి. కేసును దర్యాప్తు చేస్తున్న ముంబాయ్ జోనల్ జాయింట్ డైరెక్టర్ సమీర్ వాంఖడే కేంద్రంగా అనేక అంశాలు తెరపైకి వచ్చాయి. గతంలో బాలీవుడ్ కు చెందిన అనేకమంది ప్రముఖులు డ్రగ్స్ కేసులో పట్టుబడ్డారు. వారిని అనేక పర్యాయాలు విచారించారు. వారిలో కొందరిని అనేకసార్లు విచారణకు పిలిపించారు. కొందరిని కోర్టులో ప్రవేశపెట్టి రిమాండుకు కూడా పంపారు.
అయితే అప్పుడెప్పుడూ దర్యాప్తు అధికారుల వ్యక్తిగత జీవితాలు, వైవాహిక జీవితాల గురించి ఎప్పుడూ ఎవరు చర్చకు తీసుకురాలేదు. అప్పటి కేసుల విచారణలో రాజకీయ జోక్యం బహిరంగంగా ఎక్కడా కనబడలేదు. కానీ ఆర్యన్ ఖాన్ కేసును విచారిస్తున్న వాంఖడే హిందువు కాదని, ముస్లిమంటున్నారు. వాంఖడే రెండు వివాహాలు చేసుకున్నాడన్నారు. ఆర్యన్ను కేసు నుండి తప్పించేందుకు రు. 25 కోట్లు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు సంచలనంగా మారాయి.
ఇక్కడ గమనించాల్సింది ఏమంటే ఆర్యన్ కేసుకు వాంఖడే మతానికి సంబంధంలేదు. వాంఖడే ఎన్ని వివాహాలు చేసుకున్నాడనేది ఆయన వ్యక్తిగతం. వాంఖడే ముస్లిమా లేక హిందువా అనేది అసలు అప్రస్తుతం. అలాగే ఆర్యన్ను కేసునుండి తప్పించేందుకు రు. 25 కోట్లు డిమాండ్ చేస్తున్నారన్న కేసులోని సహనిందితుడి మాటలు పట్టుకుని ఎంత గోల జరిగిందో అందరు చూసిందే. రు. 25 కోట్లు డిమాండ్ చేసినట్లు చెప్పాల్సింది షారుక్ లేదా ఆయన పీఏ. కానీ వాళ్ళెవరు ఈ విషయంలో ఇంతవరకు నోరిప్పలేదు. ఈ కేసు ఇంత కంపు అవ్వటానికి ప్రధాన కారణం మహారాష్ట్రమంత్రి నవాబ్ మాలిక్.
వాంఖడేను టార్గెట్ చేసుకుని మాలిక నిరాధార ఆరోపణలు చేయటం అవి సంచలనంగా మారటం చూస్తే తెరవెనుక నుండి పెద్ద కతే నడిచిందని అర్ధమవుతోంది. దీని ఫలితంగా ఇపుడు కేసు దర్యాప్తు వాంఖడే నుండి సిట్ చేతిలోకి వెళ్ళిపోయింది. అంటే ఓ పద్దతి ప్రకారం వాంఖడేను దర్యాప్తు నుండి తప్పించినట్లు స్పష్టమవుతోంది. వాంఖడేను తప్పించేందుకు ఇంత తతంగం నడిచిందంటేనే సమీర్ సామర్ధ్యం ఏమిటో అర్ధమవుతోంది. మొత్తానికి క్రూయిజ్ కేసు నీరుగారిపోయినట్లే అనుమానాలు పెరిగిపోతున్నాయి.