Begin typing your search above and press return to search.
మరో అరుదైన ఘనత దక్కించుకోబోతున్న విశాఖ !
By: Tupaki Desk | 1 Dec 2021 4:30 AM GMTవిశాఖ నుంచి విదేశాలకు విహార నౌకల సర్వీసులు ప్రారంభించే దిశగా నౌకాశ్రయం అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. విశాఖ నౌకాశ్రయంలో క్రూయిజ్ టెర్మినల్ నిర్మాణానికి టెండర్లు పిలిచారు. కాంట్రాక్టు దక్కించుకునే సంస్థ ఏడాదిలో పూర్తి చేయాలి. ఆలోపు విశాఖ నగరానికి అంతర్జాతీయ విహార నౌకలు వచ్చేలా ఏర్పాట్లు చేయాలి. దేశంలోని ముంబయి, కొచ్చి, గోవా, మంగళూరు, చెన్నై తదితర నౌకాశ్రయాలకు అంతర్జాతీయ విహార నౌకలు వస్తుంటాయి. ఆయా సర్వీసులు నడిపే సంస్థల ప్రతినిధులతో మాట్లాడి విశాఖకు కూడా విదేశీ పర్యాటకులు వచ్చేలా సన్నాహాలు చేస్తున్నారు.
ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్లాలని అనుకునే వారికి వీలుగా సర్వీసులు ఉండేలా షిప్పింగ్ ఏజెంట్లు ప్రణాళికలు తయారు చేస్తున్నారు. అంతర్జాతీయ విహార నౌకలు ఐదు నక్షత్రాల హోటళ్లలోని సౌకర్యాలను అందిస్తాయి. రెస్టారెంట్లు, ఈత కొలను, ఇండోర్ గేమ్స్, థియేటర్లు, డాన్స్ ఫ్లోర్స్, తదితరాలన్నీ అందుబాటులో ఉంటాయి. ఇందులో 2 వేల మంది వరకు ప్రయాణించవచ్చు. విశాఖ నౌకాశ్రయంలో క్రూయిజ్ టెర్మినల్ అందుబాటులోకి రానుండడం ఏపీ పర్యాటక రంగంలో మైలురాయి. విశాఖ నౌకాశ్రయం, కేంద్ర నౌకాయాన, పర్యాటక శాఖల భాగస్వామ్యంతో క్రూయిజ్ టెర్మినల్ ఏర్పడుతోంది. నిర్వహణకు అవసరమైన అనుమతులను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోంది. విశాఖకు అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు రావడానికి టెర్మినల్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. సుమారు 100 కోట్ల ఖర్చుతో ఈ క్రూయిజ్ నిర్మాణం ఏడాది లోపు పూర్తి చేయనున్నారు. ఇందులో బెర్త్ కాస్ట్ 65 కోట్లు కాగా టెర్మినల్ బిల్డింగ్ 35 కోట్లు తో నిర్మించేలా అంచనాలు, అనుమతుల మంజూరు ఇప్పటికే పూర్తయ్యాయి.
అంతర్జాతీయ విహారాలతో పాటు విశాఖ నుంచి సమీపంలోని తీర నగరాలకు దేశీయ క్రూయిజ్ ప్రయాణాలను నిర్వహించుకోవచ్చు. గోవా-ముంబయి మధ్య నిర్వహిస్తున్న దేశీయ క్రూయిజ్ విహారం విజయవంతంగా నడుస్తోంది. అలాగే అంతర్జాతీయంగా డిమాండు గణనీయంగా పెరుగుతోంది. నౌక ప్రయాణ మార్గంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా పర్యాటకులు ప్రయాణించవచ్చు. దీనిపై విశాఖ పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ రామ్మోహన్ మాట్లాడుతూ.. విశాఖ నౌకాశ్రయంలో క్రూయిజ్ టెర్మినల్ అందుబాటులోకి రానుండడం ఒక మైల్ స్టోన్ అన్నారు. విశాఖ పోర్ట్ ట్రస్ట్, కేంద్ర నౌకాయాన సంస్థ, కేంద్ర, రాష్ట్రాల పర్యాటక శాఖల భాగస్వామ్యంతో క్రూయిజ్ టెర్మినల్ ఏర్పడుతోందని తెలిపారు రామ్మోహన్ రావ్. నిర్వహణకు అవసరమైన అనుమతులను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోందని, విశాఖకు అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు రావడానికి ఈ క్రూయిజ్ టెర్మినల్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.