Begin typing your search above and press return to search.
ఆ సవాల్ దాటేస్తే ఈ శవాలన్నీ బతికేస్తాయ్
By: Tupaki Desk | 6 Jan 2016 10:38 PM GMTసైన్స్ రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతున్న ప్రస్తుత తరుణంలో ఇప్పటికి కాకపోయినా మరో 50 ఏళ్ల నాటికైనా చనిపోయినవారిని బతికించే సామర్థ్యం సొంతమవుతుందని ఎంతోమంది నమ్ముతున్నారు. మరి ఇప్పుడు చనిపోతున్నవారిని బతికించుకోవాలంటే.... ఏముంది, ఆ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేవరకు వారి మృతదేహాలను భద్రపరచడమే. ఇండియాలో ఇంకా ఇది రాకపోయినా ప్రపంచంలో మాత్రం ఇలాంటిది అప్పుడే మొదలైపోయింది.
చనిపోయినవారిని బతికించుకునే రోజు వచ్చేవరకు తమవారి మృతదేహాలను పాడవకుండా కాపాడుకునేలా చాలామంది ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అలాంటివారి కోసం క్రయోనిక్స్ సంస్థలు ప్రపంచంలోని పలు చోట్ల వెలిశాయి. మానవ మృతదేహాలు, వాటిలోని అవయవాలను ఏమాత్రం దెబ్బతినకుండా అతిశీతలంలో భద్రపర్చడాన్నే క్రయోనిక్స్ అంటారు. ఇప్పటికే అమెరికాలో రెండు - రష్యాలో ఒకటి ఇలాంటి సంస్థలు ఉన్నాయి. రష్యాలో 2005లోనే క్రయోనిక్స్ సంస్థను స్థాపించగా ఆస్ట్రియా - జర్మనీ - చైనా - స్విట్జర్లాండ్ తదితర దేశాల్లోనూ వీటిపై ఆసక్తి పెరుగుతోందని, త్వరలో అక్కడా ఏర్పాటవుతాయని తెలుస్తోంది.
సుమారు పదేళ్ల కిందటే రష్యాలో క్రయోనిక్స్ ఏర్పాటు చేశారు. రష్యా కు చెందిన ఓ శాస్త్రవేత్త కుమారుడైన 35 ఏళ్ల దనిలా మెద్వెదెవ్ దీన్ని నడిపిస్తున్నారు. మాస్కో శివారులోని సెర్గీవ్ పొసద్ పట్టణంలో ఈ సంస్థ ఉంది. అందులో ప్రస్తుతం 9 దేశాలకు చెందిన 24 మానవ మృతదేహాలను, 21 మనుషుల తలలను భద్రపరుస్తున్నారు. విచిత్రమేంటంటే కుక్కలు - పిల్లుల మృతదేహాలనూ వాటి యజమానులు భద్రపరుస్తున్నారట. ఇంకో విచిత్రమేంటంటే అక్కడున్న మానవ మృతదేహాల కంటే కుక్కలు - పిల్లులవే ఎక్కువ ఉన్నాయట.
క్రయోనిక్స్ లో భద్రపరిచేందుకు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. జబ్బుల కారణంగానో - ప్రమాదాల కారణంగానో ఆస్పత్రుల్లో చనిపోయిన వారి మృతదేశాలను కొన్ని క్షణాల్లోనే ఫ్రీజర్ బాక్సుల్లోకి ఎక్కించి, అక్కడి నుంచి ఈ క్రయోనిక్స్ కు తరలిస్తారు. శీతలీకరణలో మృతదేహంలోని రక్తకణాలు దెబ్బతినకుండా ఉండేందుకు పాత రక్తాన్ని కొంతతీసి రసాయనాలతో మిశ్రమం చేసిన కొత్త రక్తాని శరీరంలోకి ఎక్కిస్తారు. అనంతరం మృతదేహాలన్ని లేదంటే తలలను మైనస్ 196 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద భద్రపరుస్తారు.
ప్రస్తుతం మాస్కోలో మొత్తం మృదదేహాన్ని భద్రపర్చేందుకు 24 లక్షల రూపాయలు - ఒక తలను భద్రపర్చేందుకు 8 లక్షల రూపాయలు తీసుకుంటున్నారట. మరి మొండెంలేని తల ఎందుకన్న అనుమానం వస్తుంది కదా.... తలను భద్రపర్చినట్టయితే అందులో మెదడు భద్రంగా ఉంటుందని, తలను రక్షించుకుంటే భవిష్యత్తులో ఎవరి బాడీకైనా దాన్ని తగిలించే అవకాశం రావొచ్చన్నది కొందరి ఆలోచన. కాగా అమెరికాలో ఇలాంటి ఓ క్రయోనిక్స్ సంస్థ కోర్టు కేసుల కారణంగా దివాలాతీసి మూతపడగా, ఆరిజోనాలోని అల్కార్ ఇనిస్టిట్యూట్ మాత్రం ఇప్పటికీ నడుస్తోంది. అయితే ఇక్కడ రేటు చాలా ఎక్కువ. ఒక్క మానవ మృతదేహాన్ని భద్రపర్చేందుకు 1.33 కోట్ల రూపాయలను, తలకు 53 లక్షలను వసూలు చేస్తున్నారు.