Begin typing your search above and press return to search.
పాడు క్రిప్టో ముంచేసింది.. 7 రోజుల్లో 'సున్నా' విలువకు పడిపోయింది
By: Tupaki Desk | 15 May 2022 2:51 AM GMTకంటికి కనిపించని మాయదారి కరెన్సీ క్రిప్టో గురించి తెలిసిందే. ఈ డిజిటల్ కరెన్సీకి విలువ అమాంతంగా పెరిగిపోవటం.. డబ్బులున్నోళ్లు.. అంతంత మాత్రంగా డబ్బులు ఉన్న వారు సైతం ఈ కరెన్సీని కొనుగోలు చేయటం ద్వారా ఎక్కడికో వెళ్లిపోవాలన్న ప్లాన్ చేయటం తెలిసిందే. ఇలాంటి వారి పుణ్యమా అని గడిచినకొద్ది కాలంగా క్రిప్టో కరెన్సీకి బోలెడంత డిమాండ్ వచ్చి పడటమే కాదు.. అత్యధిక లావాదేవాలతో జీవితకాల గరిష్ఠాలకు పలు క్రిప్టో కరెన్సీలు చేరుకున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం అలాంటి క్రిప్టో కరెన్సీలకు పాడు రోజులు దాపురించాయి. క్రిప్టో కరెన్సీలో అత్యధిక లావాదేవీలు జరిపే బిట్ కాయన్ సంగతే తీసుకుంటే.. అది కూడా ఈ మధ్యన నేలచూపులు చూడటం షురూ చేసింది. స్థిరంగా ఉంటుందన్న పేరున్న క్రిప్టో కరెన్సీల్లో ఒకటైన టెర్రాయూఎస్ డీకి సిస్టర్ గా టోకెన్ గా చెప్పే టెర్రా యూఎస్ డీ లూనాను నమ్ముకున్న వారికి చివరకు గుండు సున్నా అయ్యింది. దీని మార్కెట్ విలువ తాజాగా వంద శాతం తరిగిపోయి.. ప్రస్తుతం దాని విలువ సున్నాకు చేరుకోవటం షాకింగ్ గా మారింది. ఇదే కరెన్సీ దాదాపు నలభై రోజుల క్రితం అంటే.. ఏప్రిల్ 5న 116 డాలర్ల భారీ గరిష్ఠానికి టచ్ కావటం గమనార్హం.
కొద్ది రోజులుగా తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్న ఈ కరెన్సీ వారం క్రితం కూడా దాని విలువ ఒక మోస్తరుగా ఉండేది. ఏమైందో ఏమో కానీ వారం వ్యవధిలో ఈ టోకెన్ విలువ 40 బిలియన్ డాలర్ల నుంచి సున్నా డాలర్లకు చేరుకోవటం షాకింగ్ గా మారింది. టెర్రా యూఎస్ డీ విలువ పడిపోవటం మొదలైన నాటినుంచి లూనా విలువ తరిగిపోవటం షురూ అయ్యింది.
అదిప్పుడు ఏకంగా సున్నాకు చేరుకోవటంతో దాన్ని నమ్ముకొని పెట్టుబడులు పెట్టిన వారందరికి గుండు సున్నా మిగిలినట్లైంది. దీంతో టెర్రా యూఎస్డీ.. లూనాను తాత్కాలికంగా డీ లిస్టు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఇక.. భారత ఎక్సైంజీలైన వజీరిక్స్.. కాయిన్ స్విచ్ కుబేర్.. కాయిన్ డీసీఎక్స్ సైతం తగ్గిపోతున్నాయి. ఇదంతా చూస్తే.. ఇంతకాలం క్రిప్టో కరెన్సీ మీద ఉన్న భయాందోళనలు నిజమైన పరిస్థితి. దీని పుణ్యమా అని ఎన్ని లక్షల మంది అడ్డంగా మునిగిపోయారో పాపం?