Begin typing your search above and press return to search.

అమెరికాలో క్రిప్టో మనీ లాండరింగ్ : అరెస్టైన ఇద్దరిలో ఒక ప్రవాస భారతీయుడు

By:  Tupaki Desk   |   11 March 2022 6:41 AM GMT
అమెరికాలో క్రిప్టో మనీ లాండరింగ్ : అరెస్టైన ఇద్దరిలో ఒక ప్రవాస భారతీయుడు
X
అమెరికా క్రిప్టోకరెన్సీ మనీలాండరింగ్‌ భారీ స్కాం జరిగింది. భారతీయ-అమెరికన్‌తో సహా ఇద్దరు వ్యక్తులపై అమెరికా కోర్టు అభియోగాలు మోపింది. వర్జీనియాకు చెందిన లోయిస్ బోయ్డ్ అనే అమెరికన్ తోపాటు.. మానిక్ మెహతానీ అనే భారతీయుడు కూడా ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. వీరికి 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడింది.

నేరారోపణ ప్రకారం.. బోయ్ద్.. మెహతానీ అనేక రకాల మోసపూరిత పథకాల పేరుతో బాధితుల నుంచి సొమ్మును కాజేశారని తేలింది. క్రిప్టోకరెన్సీ ద్వారా ఆదాయాన్ని మనీలాండర్ చేయడానికి ఇతరులతో కలిసి కుట్ర పన్నారని పోలీసులు ఆరోపించారు. లావాదేవీల రిపోర్టింగ్ అవసరాలను నివారించడానికి.. నేరపూరితంగా రాబడిని ఆర్జించారని.. డిపాజిట్లను సేకరించి మోసం చేశారని అమెరికా న్యాయ శాఖ తెలిపింది.

ప్రజల నుంచి నేరపూరిత ఆదాయాన్ని క్రిప్టోకరెన్సీగా మార్చుకున్నారని.. క్రిప్టోకరెన్సీని వారి విదేశీ సహ-కుట్రదారుల నియంత్రణలో ఉన్న వాలెట్‌లకు పంపారని న్యాయశాఖ ఆరోపించింది. ఆగస్ట్ 2020లో బోయ్డ్, మెహతానీ టెక్సాస్‌లోని లాంగ్‌వ్యూకి వెళ్లారు. అక్కడ వారు బిట్‌కాయిన్‌కు 4,50,000 డాలర్ల కంటే ఎక్కువ మార్పిడి చేయడానికి ప్రయత్నించారు.

వారిని తాత్కాలికంగా పోలీసులు అదుపులోకి తీసుకుని నగదును స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో బోయిడ్, మెహతానీతోపాటు వారి సహ-కుట్రదారులు 7,50,000 డాలర్ల కంటే ఎక్కువ లాండరింగ్ చేశారని ఫెడరల్ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు.

-హైదరాబాద్ లోనూ క్రిప్టో పేరుతో 70 లక్షలు మోసం
ఇక హైదరాబాద్ లోనూ క్రిప్టో కరెన్సీ మోసం వెలుగుచూసింది. క్రిప్టో ట్రేడింగ్ పేరుతో 70 లక్షల మోసం చేసినట్టు హైదరాబాద్ పోలీసులు గుర్తించారు. క్రిప్టో ట్రేడింగ్ లో అధిక లాభాలు వస్తాయని నమ్మించి 70 లక్షలు సైబర్ చీటర్స్ కాజేశారు. మోసపోయామని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. ఇన్వెస్ట్మెంట్ పేరుతో 28 లక్షల మోసం చేశారని గుర్తించారు.

బిజినెస్ లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించి 28 లక్షలు కాజేశారు. పెట్టుబడి డబ్బులు, లాభాలు కూడా రాకపోవడంతో మోసపోయామని హైదరాబాద్ అంబర్ పెట్ కి చెందిన ముగ్గురు యువకులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.