Begin typing your search above and press return to search.

వాట్సాప్ ద్వారా క్రిప్టో కరెన్సీ.. మరో కీలక నిర్ణయం

By:  Tupaki Desk   |   10 Dec 2021 6:01 AM GMT
వాట్సాప్ ద్వారా క్రిప్టో కరెన్సీ.. మరో కీలక నిర్ణయం
X
ఇటీవలే ఫేస్ బుక్ సంస్థ ‘మెటా’గా మారింది. మాతృసంస్థ పేరును మార్చారు. ఈ మెటా కిందనే ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ లు నడుస్తున్నాయి. ఈ మూడు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఫేమస్.

ఇప్పటికే వాట్సాప్ లో అనేక అధునాతన ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే వాట్సాప్ ద్వారా డబ్బులు చెల్లించే , బదలాయించే ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు ఇందులోనే మరో అప్షన్ ను కూడా ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది.

క్రిప్టో కరెన్సీపై ప్రపంచవ్యాప్తంగా అనుమానాలు ఉన్నప్పటికీ బడా సంస్థలు క్రిప్టో కరెన్సీపై పెట్టుబడులు పెడుతూనే ఉన్నాయి. ఎలన్ మస్క్, యాపిల్ కంపెనీలు క్రిప్టో కరెన్సీలో భారీ పెట్టుబడులు పెడుతూ ప్రోత్సహిస్తున్నాయి.

ఈ బాటలో ఇప్పుడు వాట్సాప్ కూడా నడిచేందుకు సిద్ధమైంది. నోవి పేరుతో పైలెట్ ప్రాజెక్టును చేపట్టింది. ఎంపిక చేసిన యూజర్లకు నోవి బీటా వెర్షన్లకు అందిస్తుంది. నోవిలో అవసరమైన సమాచారాన్ని అందించిన తర్వాత వాలెట్ లో కరెన్సీని ఉంచాలి. ఈ డబ్బును మెటా డిజిటల్ కరెన్సీగా మారుతుంది. ఆ డిజిటల్ కరెన్సీని క్రిప్టో కరెన్సీ రూపంలో చెల్లించవచ్చు. నోవి డిజిటల్ క్రిప్టో కరెన్సీ వెర్షన్ లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటే అందుబాటులోకి తీసుకొస్తుంది.