Begin typing your search above and press return to search.

రూ.58కోట్లు కోర్టు ధిక్కరణకు కాదట.. పరిహారమట

By:  Tupaki Desk   |   5 Aug 2021 3:30 PM GMT
రూ.58కోట్లు కోర్టు ధిక్కరణకు కాదట.. పరిహారమట
X
కోర్టు ధిక్కరణ కేసుల కోసం రూ.58 కోట్ల కేటాయింపుపై హైకోర్టుకు సీఎస్ సోమేష్ కుమార్ వివరణ ఇచ్చారు. ఆ రూ.58 కోట్లు తనపై కోర్టు ధిక్కరణ కేసుల కోసం కాదని తెలిపారు. భూసేకరణ పరిహారం చెల్లింపు కేసుల్లో కోర్టు ధిక్కరణ కేసుల కోసమేనని ఏజీ సైతం తెలిపారు.

పిటీషన్ కావాలనే కోర్టును తప్పుదోవ పట్టించారని సీఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. విచారణ సందర్భంగా వాస్తవాలు కోర్టు ముందుంచలేకపోయామని సీఎస్ అన్నారు. నిధులు విడుదల చేయవద్దన్న ఆదేశాలు ఉపసంహరించాలని సీఎస్ హైకోర్టును కోరారు.

ఈ పిల్ పై అత్యవసర విచారణ చేపట్టాలని ఏజీ బీఎస్ ప్రసాద్ న్యాయస్థానాన్ని కోరారు. ఇదిలా ఉండగా జీవో రాసిన తీరుపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అసలు ఆ జీవో తయారు చేసిన ఉద్దేంశ ఏంటి? కాగితంపై రాసిందేంటి? అని న్యాయస్థానం ప్రశ్నించింది.

జీవోను పరిశీలిస్తే కోర్టు ధిక్కరణ కేసుల ఖర్చుల కోసమేనన్న విధంగా జీవో ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. జీవో విడుదల చేసే ముందు ఎలా రాశారో న్యాయశాఖ చూడాలి కదా? అని హైకోర్టు పేర్కొంది. అనంతరం విచారణను సోమవారం నాటికి వాయిదా వేసింది.