Begin typing your search above and press return to search.

చెన్నై సూపర్ కింగ్స్ లోనే జడేజా ఎందుకున్నాడు..?

By:  Tupaki Desk   |   16 Nov 2022 1:30 PM GMT
చెన్నై సూపర్ కింగ్స్ లోనే జడేజా ఎందుకున్నాడు..?
X
గత ఐపీఎల్ సీజన్.. ఎంఎస్ ధోని కెప్టెన్సీ పగ్గాలు వదిలేసి రవీంద్ర జడేజాకు చెన్నై సూపర్ కింగ్స్ బాధ్యతలు అప్పగించారు. అప్పట్లో టీమిండియా పగ్గాలు కోహ్లీకి ఇస్తే ఎంత సూపర్ హిట్ అయ్యాడో ఇప్పుడు జడేజా కూడా అలానే అవుతాడని భావించాడు. కానీ రవీంద్ర జడేజా తను రాణించకపోగా.. జట్టుకు ఓటములు తెచ్చిపెట్టాడు. వరుసగా ఐపీఎల్ లో చెన్నై ఓడిపోవడంతో అతడిని జట్టు యాజమాన్యం ఉన్న ఫలంగా తొలగించి చివరి మ్యాచ్ లకు ధోనిని కెప్టెన్ గా ప్రకటించింది.

దీంతో అలిగిన రవీంద్ర జడేజా అర్థాంతరంగా చెన్నై నుంచి గాయం పేరుతో వైదొలిగి తన సొంత రాష్ట్రం గుజరాత్ వెళ్లిపోయాడు. తన సోషల్ మీడియాలో చెన్నై తో ఉన్న ఫొటోలను డిలీజ్ చేశాడు. తనను సంప్రదించకుండా కెప్టెన్సీ తీసేశారని రవీంద్ర జడేజా ఇలా అలకబూనాడు.

ఇక చెన్నైతో రవీంద్ర జడేజా ఆడడని.. అతడు జట్టు మారడం ఖాయమని.. మినీ వేలంలో బయటకు వస్తాడని అందరూ భావించారు. కానీ సీనియర్ ధోని చక్రం తిప్పాడు. రవీంద్ర జడేజాను సీఎస్కే అట్టిపెట్టుకునేలా చేసుకున్నాడు.

ఇటీవల ఐపీఎల్ మినీ వేలం సందర్భంగా ఫ్రాంచైజీలు తమకు అవసరం లేని ఆటగాళ్లను విడిచిపెట్టడం.. వేరే ఫ్రాంచైజీల నుంచి తమకు అవసరమైన ఆటగాళ్లను తీసుకోవడం జరిగింది. ఈ ప్రక్రియ మంగళవారం ముగిసింది. గత సీజన్ లో చెన్నైతో గొడవ పెట్టుకున్న రవీంద్రా జడేజా ఈసారి సీఎస్కేను వీడడం ఖాయమని అందరూ అనుకున్నారు.

జడేజా కెప్టెన్సీ పోయాక మిగతా మ్యాచుల్లో ఆడకుండా.. చెన్నైకి ఫ్రాంచైజీకి టాటా చెప్పేశాడని.. అతడిని ఈసారి తీసుకోవాలని అందరూ భావించారు.కానీ అందరికి షాకిస్తూ చెన్నై అతడిని అట్టిపెట్టుకుంది. జడేజా కూడా ట్విటర్ లో ధోనికి సలాం కొడుతున్నట్టు ఉన్న ఫొటో పెట్టి ‘రీస్టార్ట్’ అనే మెసేజ్ పెట్టాడు. దీన్ని బట్టి మధ్యలో ధోని జోక్యం చేసుకొని జడేజాకు, చెన్నై ఫ్రాంచైజీకి సయోధ్య కుదిర్చినట్టుగా అర్థమవుతోంది. రాబోయే సీజన్ లో జట్టును నడిపించాక ధోని ఐపీఎల్ నుంచి మొత్తం రిటైర్ మెంట్ తీసుకుంటాడని.. మళ్లీ రవీంద్ర జడేజాకే తిరిగి చెన్నై పగ్గాలు దక్కే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

ఇక సన్ రైజర్స్ మాత్రం కెప్టెన్ విలయమ్సన్ ను వదిలించుకుంది. మరో సీనియర్ వెస్టిండీస్ కెప్టెన్ పూరన్ ను వదిలేసింది. మంచి ఆటగాళ్లను అట్టిపెట్టుకొని చెన్నై బలపడగా.. ఉన్న వారిని వదిలేసి సన్ రైజర్స్ మరీ వీక్ అయిపోయింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.