Begin typing your search above and press return to search.
కొత్త సంవత్సరంలోనూ పాత విత్ డ్రా కష్టాలే
By: Tupaki Desk | 26 Dec 2016 4:19 AM GMTతెలుగు సినిమాల్లో తరచూ ఒక జోక్.. వివిధ సన్నివేశాల రూపంలో కనిపిస్తూ ఉంటుంది. అదేంటి రెండేళ్లు నా టైం బాగాలేదా? ఆ తర్వాత..? అని అడిగినోడికి.. ఆ తర్వాతేముంది.. అలవాటైపోతుందంటూ ఎటకారం చేసుకునే జోక్ ను.. ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలందరి జీవితాలకు అప్లై చేసినట్లుగా కనిపిస్తోంది. నవంబరు ఎనిమిదో తేదీ రాత్రి వేళ.. టీవీ స్క్రీన్ల మీదకు వచ్చిన ఆయన పెద్దనోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించటమే కాదు.. నగదు విత్ డ్రాకు సంబంధించి వివరాల్ని వెల్లడించారు.
ఆ సమయంలో మోడీ చెప్పినమాటల్ని విన్న చాలామంది షాక్ కు గురై.. ఆయనేం చెబుతున్నారో కూడా అర్థం చేసుకోలేని పరిస్థితి. ఆ తర్వాత ఆయన చెప్పిన మాటల్ని ఒక్కొక్కటిగా అర్థం చేసుకున్నారు. అది మొదలు.. కరెన్సీ కష్టాలు జనాల జీవితాల్లో ఒక భాగంగా మారిపోయాయి. తనకు యాభై రోజుల టైం ఇస్తే చాలు.. మొత్తంగా పరిస్థితుల్ని మార్చేస్తామన్నప్పుడు.. అవి ఎలా ఉంటాయన్న ఊహ చాలామంది ప్రజలు ఊహించలేకపోయారు. కానీ.. ఒక్కొక్కటిగా విరుచుకుపడిన సవాళ్లతో.. మోడీ చెప్పిన మాటల అసలు అర్థం ఏమిటన్నది అవగతమైందని చెప్పాలి.
చాలామంది మోడీ మీద ఉన్న నమ్మకంతో.. యాభైరోజులు ఎప్పుడెప్పుడు గడిచిపోతాయా? కరెన్సీ కష్టాల నుంచి ఎప్పుడెప్పుడు బయటపడతామా? అంటూ ఎదురుచూస్తున్న పరిస్థితి. అయితే.. అలాంటివి కుదరవన్న మాట పలువురి నోట వినిపించింది. దీనికి తగ్గట్లే తాజాగా చోటు చేసుకుంటున్నపరిణామాలు చూస్తే.. కరెన్సీ కష్టాలు రానున్న రోజుల్లోతగ్గే ఛాన్స్ ఏ మాత్రం లేవని చెప్పక తప్పుదు.
క్యాష్ లెస్ లావాదేవీల మీద కేంద్రం ఫోకస్ చేసిన వేళ.. విత్ డ్రా మీదున్న పరిమితుల్ని కానీ ఎత్తేస్తే..కార్డుల వినియోగం పక్కదారి పట్టే ప్రమాదం ఉంది. అందుకే.. మొదట చెప్పినట్లు యాభై రోజుల తర్వాత కూడా నగదు విత్ డ్రా మీద పరిమితులు విధించటం ఖాయమని చెబుతున్నారు. ఇదే విషయాన్ని దేశంలోనే అతి పెద్ద బ్యాంకు అయిన ఎస్ బీఐ ఛైర్ పర్సన్ అరుంధతీ భట్టాచార్య సైతం సూచనగా చెప్పారంటే.. పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్న మాట వినిపిస్తోంది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏటీఎంల నుంచి రూ.2500.. వారం వ్యవధిలో బ్యాంకుల నుంచి రూ.24వేలు విత్ డ్రా చేసుకునే వీలుంది. కానీ.. బ్యాంకుల్లో కరెన్సీ లభ్యత తక్కువగా ఉందన్న కారణంగా.. రూ.3 వేల నుంచిరూ.6 మధ్య తమకున్న నగదు లభ్యతకు అనుగుణంగా క్యాష్ ఇస్తున్నారు. కొత్త సంవత్సరంలో సరికొత్త సవాళ్లను ఎదుర్కొంటూ.. అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తామని ప్రధాని మోడీ చెబుతున్న వేళ.. ఇప్పటికిప్పుడు విత్ డ్రా మీద ఆంక్షలు తొలగించే అవకాశం లేదని చెప్పకతప్పదు. అంటే.. కొత్త సంవత్సరంలోనూ విత్ డ్రా కష్టాలేనన్నమాట.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/