Begin typing your search above and press return to search.
అద్భుత చిత్రం: అంగారకుడిపై అస్తమిస్తున్న సూర్యుడు!
By: Tupaki Desk | 12 May 2015 9:56 AM GMTసాయంత్రం పూట సముద్ర తీరానికో, నది ఒడ్డుకో వెళ్ళి చూస్తే సముద్రంలోకి దిగిపోతున్నట్లు, నదిలోకి జారిపోతున్నట్లు సూర్యుడు అస్తమించే సన్నివేశం కనిపిస్తుంది! పగలంతా తనను నేరుగా చూసే అవకాశం మానవ మాతృడెవ్వరికీ ఇవ్వకుండా నిప్పులు చెరిగే సూర్యభగవానుడు, సాయంత్రం చల్లబడిన తర్వాత మాత్రం అందరూ చూసేలా మారిపోతాడు! ఈ సన్నివేశానికి సముద్ర తీరం సరైన లొకేషన్!
సూర్యుడు భూమిపై అస్తమించడం అందరం చూశాం... మరి అంగారకుడిపై అస్తమిస్తున్నప్పుడు ఎలా ఉంటుంది! ప్రస్తుతం అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు చెందిన క్యూరియాసిటీ రోవర్ కొన్ని ఫోటోలు తీసి పంపించింది. అంగారకుడిపై అస్తమిస్తున్న సూర్యుడిని కెమెరాలో బంధించి పంపించింది. భూమిమీద సూర్యాస్తమయం అంటే పసుపు, ఎరుపు రంగుల మేళవింపులో ఉంటుంది కానీ అంగారకుడిపై మాత్రం మరింత అందంగా నీలం రంగులో ఉన్నాడు!
మాస్ట్ కెమెరాను ఉపయోగించి కొన్ని చిత్రాలను భూమి మీదకు పంపించింది. ఈ ఫోటోలను పరిశీలించిన అనంతరం తన వెబ్ సైట్లో పెట్టింది నాసా. అరుణ గ్రహంపై నీలం రంగులో ఉండటానికి గల కారణాల పైన తాము పరిశోధన చేస్తామని టెక్సాస్ ఏ అండ్ ఎం విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ లెమన్ ప్రకటించారు!