Begin typing your search above and press return to search.
నల్ల కుబేరులు థిలాసా.. సామాన్యుడు విలవిల
By: Tupaki Desk | 26 Nov 2016 5:56 AM GMTనోట్ల రద్దు నిర్ణయం ప్రధాని మోడీ నోటి నుంచి వచ్చిన వెంటనే సామాన్యుడు చిద్విలాసంగా నవ్వితే.. బడాబాబుల కాళ్ల కింద భూముల కదిలిపోయింది. ఈ దెబ్బతో నల్లకుబేరుల ఆటలకు చెక్ పడినట్లేనని భావించారు. అదేసమయంలో సామాన్యుడు విపరీతమైన సంతోషానికి గురయ్యారు. దమ్మున్నప్రధానిగా మోడీని పొగిడేశారు. ఇదంతా నోట్ల రద్దు ప్రకటన వెలువడిన వెనువెంటనే చోటు చేసుకున్న పరిస్థితి. ఇదిలాఉంటే.. నోట్ల రద్దు నిర్ణయం వెలువడిన ఒక రోజు తర్వాత బ్యాంకులు పని చేయటం మొదలైంది.
అందురూ అనుకున్నట్లే.. బ్యాంకుల దగ్గర భారీ క్యూలు దర్శనమిచ్చాయి. రద్దు నిర్ణయం వెలువడిన రెండురోజుల తర్వాత ఏటీఎంలు పని చేయటం ప్రారంభించాయి. అయితే.. అందరూ ఊహించినట్లుగా నోట్ల కొరత తీరలేదు సరికదా.. అంతకంతకూ పెరిగిపోయాయి. ఎందుకిలా అన్నది ఒక పెద్ద ప్రశ్నగా మారింది. నోట్ల రద్దు నిర్ణయం తర్వాత.. కరెన్సీ ఫ్లోపై కేంద్రం వ్యూహాత్మకంగా చెక్ పెట్టిందన్న మాట వినిపిస్తోంది.
కరెన్సీని ఎలాంటి కొరత లేకుండా అందుబాటులోకి తీసుకొస్తే.. నల్లధనాన్ని ఎవరికి వారు మార్చుకునే అవకాశం ఉంటుందని.. అందుకే.. అలాంటి వాటికి కళ్లాలు వేస్తూ.. కరెన్సీ లభ్యత పెద్దగా లేకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే.. అదే ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారినట్లు చెప్పొచ్చు. కరెన్సీ కొరత అన్న మాట ప్రచారం వచ్చిందో.. అవసరం ఉన్నా..లేకున్నా.. వీలైనంతవరకూ నగదును చేతిలో ఉంచుకోవాలన్న ఆశ సగటు జీవిలో పెరిగిపోయింది.
దీంతో.. బ్యాంకు ఖాతాలో ఉన్న మొత్తాన్నివీలైనంతవరక క్యాష్ గా చేతిలో ఉంచుకోవాలన్నతాపత్రయం పెరిగింది. నోట్లకొరతకు ఇదో కారణమైతే.. కేంద్రం విడుదల చేసిన రూ.2వేల నోటు కూడా కారణంగా చెప్పాలి. ఈ భారీ నోటును తీసుకొని చిల్లర ఇచ్చేవారెవరూ లేకపోవటంతో.. చిల్లర నోట్ల కోసం బ్యాంకుల్ని సంప్రదించే పనిలో పడ్డారు పలువురు. అంటే.. నోట్ల మార్పడి.. నగదు విత్ డ్రా.. పెద్ద నోట్లను చిన్న నోట్లుగా మార్చుకోవటం.. ఏటీఎంలలో డబ్బులు డ్రా చేసుకునే బ్యాచ్ ఇలా ఎవరికి వారు.. తమకున్న సమస్యల పరిష్కారానికి బ్యాంకులకు భారీగా చేరుకోవటంతో క్యూ బారులు భారీగా పెరిగిపోయాయి.
ఈ సమాచారం మీడియాలో పెద్దఎత్తున ప్రచారం జరిగిపోవటంతో కరెన్సీ కొరతపై ప్రజల్లో సందేహాలు నెలకొన్న పరిస్థితి. దీంతో.. కరెన్సీ కోసం బ్యాంకుల్ని ఆశ్రయించే వారిసంఖ్య అంతకంతకూపెరిగిపోతోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. నగదు విత్ డ్రాకు సంబంధించి వారానికి రూ.24వేలు తీసుకునే వెసులుబాటు ఉంది. కానీ.. ఆ మొత్తాన్నిఇవ్వకుండా బ్యాంకులు తమ కరెన్సీ నోట్ల కష్టాల్ని చెప్పి.. రూ.2వేల మొత్తాన్ని మాత్రమే ఇవ్వటంతో.. రూ.10వేలు కావాల్సిన వారు ఐదుసార్లు క్యూలో నిలుచునే పరిస్థితి. దీంతో.. ఒకసారి బ్యాంకుతో అవసరం పడిన వారంతా.. అదే పనిగా బ్యాంకుల ముందు నిలుచునే పరిస్థితి.
ఇలా.. ప్రతి విషయంలోనూ చోటు చేసుకుంటున్న పరిణామాలతో బ్యాంకుల వద్ద క్యూ లైన్లు భారీగా పెరిగిపోవటమే కాదు..కరెన్సీకష్టాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. నల్ల కుబేరులు తమ వద్దనున్న బ్లాక్ మనీని అక్రమ మార్గాల్లో మార్చుకోవటం.. దీనికి కొన్నిబ్యాంకులు.. సహకారబ్యాంకులు తమదైన సహకారం అందించటంతో కరెన్సీనోట్ల కటకట అంతకంతకూ పెరిగిపోతున్న దుస్థితి. కర్ణుడి చావుకు సవాలచ్చ కారణాలన్నట్లుగా నోట్ల రద్దు ఎపిసోడ్ లో సామాన్యుడే ప్రతిసారీ టార్గెట్ కావటం గమనార్హం. నల్లకుబేరులు తమదైన ప్రయత్నాలు చేసుకోవటంతో..రద్దు నిర్ణయంతో ఎవరైతే టార్గెట్ అవుతారని అనుకున్నారో వారికి ఇబ్బందులు పరిమితంగా ఉండటం.. లబ్థి పొందుతారని భావించిన సామాన్యుడు క్యూ వరసల్లో గంటల కొద్దీ వెయిట్ చేయాల్సి వస్తోంది. ఇది.. సామాన్యుల్ని మరింత అసంతృప్తికి గురి చేస్తోంది.