Begin typing your search above and press return to search.
చెన్నైలో ఇళ్ల ముందు కరెన్సీ నోట్లు పడేసి వెళుతున్నారు
By: Tupaki Desk | 5 May 2020 8:10 AM GMTకారణం ఏమిటన్న దానిపై క్లారిటీ రావట్లేదు. కానీ.. చెన్నైలోని పలు ప్రాంతాల్లో గుర్తు తెలియని కొందరు ఇళ్ల ముందు కరెన్సీ నోట్లను పడేసి వెళుతున్న వైనం సంచలనంగా మారుతోంది. ఎందుకిలా చేస్తున్నారు? దాని వెనుకు కుట్ర ఏమైనా జరుగుతుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. కరోనా వ్యాప్తి కోసం ఇలాంటి దుర్మార్గపు చేష్టలు చేస్తున్నారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. కరెన్సీ నోట్లతో కరోనా వ్యాప్తి జరుగుతుందన్న దానికి సరైన ఆధారాలు లేనప్పటికీ.. ఇళ్ల ముందు రూ.20.. రూ.50.. రూ.100 నోట్లు పడేసి వెళ్లటం హాట్ టాపిక్ గా మారింది.
చెన్నైలోని పురసైవాక్కం.. వెస్ట్ మాంబళం.. మాధవరం తదితర ప్రాంతాల్లోని రాత్రిళ్లు.. సైకిళ్ల మీద వస్తున్న వారు ఇళ్ల ముందు కరెన్సీ నోట్లను పడేసి వెళుతున్నారు. వైరస్ వ్యాప్తికి కుట్ర సాగుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి చేష్టలు మీకు ఎదురైతే.. ఆ నోట్లను ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోవద్దంటూ వాట్సాప్ సందేశాలు ఎక్కువ అవుతున్నాయి. దీనికి తగ్గట్లే.. ప్రజలెవ్వరూ ఆ నోట్ల జోలికి పోవటం లేదు. వాటిని ముట్టుకోవటం లేదు.
ఈ ఉదంతం పోలీసుల వరకూ వెళ్లటంతో వారు రంగంలోకి దిగారు. సీసీ కెమేరాల ఆధారంగా నోట్లను ఇళ్ల ముందు పడేసి వెళుతున్న వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇళ్లల్లో దొంగతనాలు చేసేందుకు వీలుగా దొంగలు ఈ తరహాలో కరెన్సీ నోట్లను పడేసి వెళుతున్నారన్న సందేహాల్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలా.. ఇళ్ల ముందు కరెన్సీ నోట్లను పడేసి వెళ్లే వారి లెక్క తేల్చేందుకు చెన్నై పోలీసు యంత్రాంగం ప్రయత్నిస్తోంది.