Begin typing your search above and press return to search.

కరెన్సీ నోటు ద్వారా కరోనా.. కొత్త విషయం వెలుగులోకి

By:  Tupaki Desk   |   21 March 2020 9:00 AM GMT
కరెన్సీ నోటు ద్వారా కరోనా.. కొత్త విషయం వెలుగులోకి
X
కరోనా వైరస్‌ ఒకరి నుంచి మరొకరు అంటుకుంటోది. దీనివలనే ఈ వైరస్ వ్యాప్తి తీవ్రమవుతోంది. దీంతో ప్రపంచమంతా కరోనా బారిన పడి సతమతమవుతోంది. అయితే ఈ కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఇన్నాళ్లు మనుషులను తాకటం ద్వారా, వారు సంచరించిన ప్రదేశాల్లోని వస్తువులను తాకడం, వారి తుమ్ము, దగ్గు ద్వారా తుంపర్లు పడి విస్తరిస్తుందని విన్నాం. కానీ ఇప్పుడు ఆ వైరస్ సోకిన వారు వినియోగించిన నోటు ద్వారా కూడా ఈ వైరస్ ఇతరులకు వ్యాపిస్తోందని ఓ ప్రభుత్వ సంస్థ గుర్తించింది. దీంతో ప్రజలందరూ షాకవుతున్నారు. నోటు ముట్టుకుంటే కరోనా వైరస్ వ్యాపిస్తుందని వార్త తెలియడంతో అందరూ అవాక్కవుతున్నారు.

కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా ట్రేడర్స్‌(సీఏఐటీ) ఈ మేరకు ఆర్థిక శాఖకు నివేదిక సమర్పించింది. నోటు ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాపిస్తోందని చెప్పడంతో కలవరం సృష్టిస్తోంది. ప్రతి వ్యక్తి వద్ద నోట్లు ఉంటాయి. నోటు ద్వారా వైరస్ వ్యాపిస్తుందంటే దేశవ్యాప్తంగా ఆ వైరస్ తీవ్రంగా ప్రబలే అవకాశం ఉంది. సాధారణంగా నోట్లు లెక్కించాలంటే నోట్లో వేలు తడిపి లెక్కిస్తాం. ఆ విధంగా కరోనా సోకిన వ్యక్తి నోట్లు లెక్కించేందుకు ఉమ్మిని వినియోగిస్తే ఆ వైరస్ ఆ నోటికి అంటుంతుందని సీఏఐటీ గుర్తించింది. ఆ కరోనా వైరస్ బాధితుడి ఉమ్ముతో తడి చేసుకుని నోట్లు లెక్కించగా ఆ నోట్లు ఇతరులకు వెళ్లితే ఆ వైరస్ ఇతరులకు వ్యాపించే ప్రమాదం పొంచి ఉందని ఆర్థిక శాఖను ఆ సంస్థ హెచ్చరించింది. అయితే ఆ వైరస్ కరెన్సీ నోట్ల పై ఎన్ని గంటలు ఉంటుంది అనేది ఇంకా అధ్యాయనం చేస్తున్నారు.

కరోనా వైరస్‌ వ్యక్తి వాడిని నోటు బయటకు వచ్చి ఇతరులు వినియోగిస్తే వారికి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆ నోటు వాడిన వారందరికీ వైరస్ సోకే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. దీంతో ఆ సంస్థ ఆర్థిక శాఖకు కొన్ని సూచనలు చేసింది. నోట్లు నోటి తడితో లెక్కించవద్దని సూచించింది. నోటి తడితో చేయకుండానే లెక్కించాలని పేర్కొంది. ఒక ప్రజలు వీలైనంత వరకు డిజిటల్ లావాదేవీలు చేసుకోవాలని తెలిపింది. ఫోన్‌పే, గూగుల్‌పే తదితర వాటితో చెల్లింపులు చేసుకోవాలని చెబుతోంది. నోట్ల నుంచి కూడా వ్యాపించే ప్రమాదం ఉండడంతో మీరు కూడా డిజిటల్ లావాదేవీలు చేయండి.