Begin typing your search above and press return to search.
400 ఏళ్ల శాపం నుంచి మైసూర్ రాజవంశానికి విముక్తి!
By: Tupaki Desk | 7 Dec 2017 2:45 PM GMTఅవును. మైసూర్ రాజవంశానికి 400 ఏళ్ల నుంచి విముక్తి లభించింది. రాజవంశస్థుల సుదీర్ఘకాల కాంక్ష నెరవేరింది. వినడానికి ఇదేదో సినిమా స్టోరీలాగానే అనిపిస్తుంది.. కానీ నిజం. మైసూర్ రాజ కుటుంబమైన ఒడయార్లకు 400 ఏళ్ల కిందటి శాపం నుంచి విముక్తి లభించింది. ఆ కుటుంబానికి ఇప్పుడు వారసుడు వచ్చాడు. యదువీర్ క్రిష్ణదత్త చామరాజ వడయార్, ఆయన భార్య త్రిషికా కుమారి దంపతులకు పండంటి మగ బిడ్డ జన్మించాడు. దీంతో మైసూర్‌లో సంబరాలు అంబరాన్ని అంటాయి.
గతేడాది జూన్‌లో యదువీర్ క్రిష్ణదత్త చామరాజ వడయార్, త్రిషికా కుమారి వివాహం జరిగిన విషయం తెలిసిందే. యదువీర్‌ను ఇంతకుముందు రాణీ ప్రమోదా దేవి రెండేళ్ల కిందట దత్తతకు తీసుకుంది. ప్రమోదా దేవి, ఆమె భర్త శ్రీకాంతదత్త నరసింహరాజాకు పిల్లలు లేరు. 1612 నుంచి ఈ రాజ కుటుంబం ఓ శాపాన్ని అనుభవిస్తున్నట్లు చెబుతారు. వీళ్లకు ఇప్పటివరకు సొంత వారసులు లేరు. 1612లో వడయార్స్ రాజ్యాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ సమయంలో అప్పటి శ్రీరంగపట్నం రాజు భార్య ఆలెమాలెమ్మ ఈ కుటుంబాన్ని శపించిందని అంటారు. రాజవంశానికి చెందిన నగలతో ఆమె కావేరీ తీరంలోని తలక్కాడ్ అనే ఊరికి పారిపోతున్న సమయంలో.. రాజా వడయార్‌కు చెందిన సైనికులు ఆమెను చుట్టుముట్టారు.
దీంతో ఆమె కావేరీ నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సమయంలోనే వడయార్ల కుటుంబానికి ఎప్పుడూ వారసులు పుట్టరంటూ శపించింది. ఆమె శపించినట్లే ఈ నాలుగు వందల ఏళ్లలో వడయార్లకు వారసులు పుట్టలేదు. సమీప బంధువులను దత్తతకు తీసుకుంటూ రాజ్యాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఇన్నేళ్లుగా ఆలెమాలెమ్మ అనుగ్రహం పొందడానికి ఈ రాజ కుటుంబం ప్రయత్నిస్తూనే ఉంది. అప్పట్లోనే రాజా వడయార్ మైసూర్‌లో ఆమె విగ్రహం కూడా ఏర్పాటుచేశారు. కొన్నేళ్ల కిందట అప్పటి రాజు శ్రీకాంతదత్త.. తలక్కాడ్‌లో ఆమెకు ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. మొత్తానికి ఇన్నేళ్లకు వారసుని జననంతో తమకు శాప విముక్తి కలిగిందని మైసూర్ రాజ కుటుంబం భావిస్తోంది.
కాగా, ఒడియార్ రాజ్యవంశానికి 27వ రాజు అయిన యుద్‌వీర్ అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీలో ఇంగ్లిష్, ఎకనామిక్స్‌లో బీఏ డిగ్రీని పూర్తిచేసుకున్నారు. మైసూరును క్రీస్తు శకం 1399 నుంచి 1947వరకు ఒడియార్ వంశస్తులు పరిపాలించారు. 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ 1950లో భారత ప్రభుత్వంలో తన రాజ్యాన్ని విలీనం చేశారు. ఒడియార్ వంశస్తులు చేసిన సేవలను ఇప్పటికీ మైసూరు ప్రాంత ప్రజలు గుర్తుచేసుకుంటారు.