Begin typing your search above and press return to search.
విలీనంతో బ్యాంకుల కస్టమర్ల పరిస్థితి ఏంటి?
By: Tupaki Desk | 31 Aug 2019 5:21 AM GMTప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక సంక్షోభం భారత్ ను వెంటాడుతున్న వేళ కేంద్రం ఉద్దీపన చర్యలకు ఉపక్రమించింది. బ్యాంకులకు భద్రత కల్పించి నష్టాలు తగ్గించి ప్రజల్లో నగదు లభ్యతను పెంచడానికి ఉపక్రమించింది. ఇందులో భాగంగానే బ్యాంకుల సంస్కరణకు పూనుకుంది. ఏకంగా 10 బ్యాంకులను విలీనం చేస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సంచలన ప్రకటన చేశారు.
2017లో ఎస్ బీఐలో అనుబంధ బ్యాంకుల విలీనం.. గత ఏడాది బ్యాంక్ ఆఫ్ బరోడాలో దేనా - విజయ బ్యాంకులను విలీనం చేసింది ప్రభుత్వం. ఇప్పుడు ఏకంగా 27 బ్యాంకులున్న స్థానంలో 12కు కుదించింది. దాదాపు శతాబ్ధం చరిత్రగల మన ఆంధ్రాబ్యాంకును యూనియన్ బ్యాంకులో కలిపేసింది.
అయితే బ్యాంకుల విలీనంతో ఆయా బ్యాంకుల కస్టమర్ల పరిస్థితి ఏంటి? ఎలా ఉండబోతోంది. ఏమేం మార్పులు జరుగుతాయో తెలుసుకుందాం.
*బ్యాంకు మారిన కస్టమర్లకు ముందుగా అకౌంట్ నంబర్ - కస్టమర్ ఐడీ - బ్యాంకు ఐఎఫ్ ఎస్సీ కోడ్ మారుతుంది.
*కొత్త చెక్ బుక్ - డెబిట్ - క్రెడిట్ కార్డులు తీసుకోవాలి
*ఐఎఫ్ ఎస్ సీ కోడ్ ను అప్ డేట్ చేసుకోవాలి. ఇన్ కంట్యాక్స్ వద్ద కొత్త మార్పులను నమోదు చేయాలి.
* పాత బ్యాంక్ కు ఈఎంఐ లు ఉన్నవారు కొత్త బ్యాంకులో అనుమతులు తీసుకోవాలి.
*బిల్ పేమంట్స్ సంబంధించి కొత్త మార్గదర్శకాలు జారీ చేయాల్సి ఉంటుంది.
*బ్యాంక్ బ్రాంచ్ మారే అవకాశం ఉంటుంది.
*సేవింగ్స్ ఖాతాపై వచ్చే వడ్డీ రేటు కూడా మారుతుంది.
అయితే బ్యాంకుల విలీనంతో ఇదివరకు మనం చేసిన ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ మారదు.. రుణాలపై వడ్డీల్లో కూడా మార్పుండదు.