Begin typing your search above and press return to search.
కన్నయ్య నాలుక తెస్తే రూ.5లక్షలు?
By: Tupaki Desk | 5 March 2016 8:09 AM GMTమేనేజ్ మెంట్ గురు మాదిరి మాట్లాడే ప్రధాని నరేంద్ర మోడీ హితవచనాలు ఓవైపు చెబుతుంటే.. మరోవైపు ఆయన పార్టీకి చెందిన వివిధ విభాగాలకు చెందిన కొందరు ఇష్టారాజ్యంగా చెలరేగిపోవటం ఈ మధ్య కాలంలో ఎక్కువైంది. తప్పు చేస్తే చట్టబద్ధంగా శిక్ష పడాలని.. అందుకు పోరాటాలు చేయటం ఒక పద్ధతి. ఇందుకు భిన్నంగా.. ఇష్టారాజ్యంగా మాట్లాడటం.. విపరీత పోకడలతో ప్రకటనలు చేయటం ఈ మధ్యన ఎక్కువైంది.
అధికారంలో ఉన్నప్పుడు అణిగిమణిగి ఉండాలన్న కనీస ఆలోచనలు చేయని కొందరు బీజేపీ నేతల పుణ్యమా అని ఎన్డీయే సర్కారు మీద పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా అలాంటి వివాదాస్పద వ్యాఖ్య ను ఒకటి చేశారు భారతీయ జనతా యువ మోర్చా నాయకుడు కుల్ దీప్ వర్ష్. ఢిల్లీ జేఎన్ యూ వర్సిటీకి చెందిన కన్నయ్య దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన ఆరోపణలు ఎదుర్కోవటం తెలిసిందే. ఆయనకు సంబంధించిన ఒక వీడియో క్లిప్పింగ్ వివాదాస్పదం కావటం.. ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకొని జైలుకు తరలించటం లాంటివి జరిగాయి. అయితే.. కన్నయ్యపై నేరారోపణ చేస్తున్న వీడియోలు మార్ఫింగ్ కు గురయ్యాయన్న వాదనతో ఆయనకు బెయిల్ లభించటం తెలిసిందే.
తాజాగా కన్నయ్య మీద విమర్శలు చేసిన బీజేపీ యూత్ నాయకుడు కుల్ దీప్ వర్ష్.. ‘‘అతడి నాలుక తెగ కోసి తీసుకొస్తే రూ.5లక్షలు నజరానా ఇస్తాం’’ అని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవేళ కన్నయ్య దేశద్రోహానికి పాల్పడితే.. అతడిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలే తప్పించి.. ఇలా వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకున్నట్లుగా వ్యవహరించటం.. హింసను పెంచేలా వ్యాఖ్యలు చేయటం ఏ మాత్రం సబబుగా లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ తరహా వ్యాఖ్యలు మోడీ సర్కారుపై లేనిపోని సందేహాలు మరింత పెంచేలా చేస్తాయని మర్చిపోకూడదు.