Begin typing your search above and press return to search.

నూతన జీతంతో ఉద్యోగులకు కోతలు తప్పవు..!

By:  Tupaki Desk   |   23 Jan 2022 5:49 AM GMT
నూతన జీతంతో ఉద్యోగులకు కోతలు తప్పవు..!
X
ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఆర్సీపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు పీఆర్సీ ప్రకటించాలని ఆందోళన చేసిన వారు.. ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పీఆర్సీ సవరణతో నెలజీతంలో భారీగా కోత పడుతుండడంతో పాటు కొంత మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించాల్సి రావడంపై ఆందోళన చెందుతున్నారు. 11వ వేతన సరవణలో భాగంగా మధ్యంతర భృతి (హై ఆర్) పై లెక్కలు వేస్తామని ప్రభుత్వం చెబుతోంది. అంటే ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం ఐఆర్ మొత్తాన్ని లెక్కించి ఆ మొత్తాన్ని డీఏ బకాయిల నుంచి మినహించిన తరువాత ఉద్యోగులకు చెల్లించాల్సి వస్తే ఇస్తానంటోంది. అయితే ఇదే సమయంలో ఉద్యోగులు ప్రభుత్వానికి బకాయిలుగా మారితే వాయిదాల రూపంలో వెనక్కి తీసుకుంటామని చెబుతోంది.

ఏపీలో 11 వేతన సవరణ సంఘం అమలుకు సంబంధించిన ఫిట్మెంట్, హెచ్ఆర్ఏ విధి విధానాలను రూపొందిస్తూ ఈనెల 17న జీవో జారీ చేసింది. ఈ జీవో ప్రకారం.. 2019 జూలై నుంచి మూలవేతనంపై 27 శాతం ఐఆర్ ప్రకటించి 2020 ఏప్రిల్ నుంచి మానిటరీ ప్రయోజనం కల్పిస్తామని, ఇదే సంవత్సరం జనవరి జీతంతో కలిపి నగదు రూపంలో వేతనాలు చెల్లిస్తామని పేర్కొంది. ఇక కొత్త పీఆర్సీలో ఫిట్మెంట్ ను 23 శాతాన్ని తగ్గించింది. సీసీఐ పూర్తిగా తొలగించి కొన్ని చోట్ల మాత్రమే అమలులో ఉంటుందని తెలిపింది. దీని ప్రకారం ఇప్పటికే ఉద్యోగులు అదనంగా తీసుకున్న ఐఆర్ మొత్తాన్ని లెక్కించి ఆ మొత్తాన్ని డీఏ బకాయిల నుంచి మినహాయిస్తామని తెలపింది. అలా మినహాయించిన తరువాత కూడా ఉద్యోగులు ప్రభుత్వానికి బకాయిలు ఉంటే వాటిని జీపీఎఫ్ ఖాతాలను జమ చేస్తామని పేర్కొంది. ప్రభుత్వం జారీ చేసిన జీవో 10వ పేజీలో ఈ విషయాన్ని పేర్కొంది.

అంటే కొత్త జీవో ప్రకారం ఉద్యోగులు ప్రభుత్వానికి బకాయిలు పడితే తిరిగి ఇతర రూపంలో చెల్లించాలన్న మాట. ఉదాహరణకు ఒక ఉద్యోగికి రూ.43వేల 600 జీతం ఉందనుకుందాం. 2020 ఏప్రిల్ నుంచి 2021 డిసెంబర్ వరకు 27 శాతం ఐఆర్, పాత హెచ్ఆర్ ఏ, సీసీఏల ప్రకారం ఆ ఉద్యోగి పొందిన జీతం రూ.18, 24000గా లెక్క తేలుతోంది. అయితే ప్రభుత్వం తాజా ఆదేశాల ప్రకారం 2020 ఏప్రిల్ నుంచి కొత్త పేస్కేల్లలో జీతాలను లెక్క కట్టాల్సి ఉంది. దీంతో ఆ ఉద్యోగి మూల వేతనం దాదాపుగా 67వేలు అవుతుంది.

నాటి నుంచి ఆయన పొందని మొత్తం వేతనం రూ.17లక్షల 31వేలు 384 ఉంటే దీనికి డీఏ బకాయిలు రూ.20 వేలు కలిపారు. అంటే కొత్త వేతన స్కేళ్ల ప్రకారం రూ.17,51,985 పొందాల్సి ఉండగా ఇప్పటికే రూ.18లక్షల 24 వేలు డ్రా చేశారు. అంటే మిగిలిన రూ.70 వేల వరకు ఆ ఉద్యోగి తిరిగి ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఇక సీనియర్ అసిస్టెంట్ గా ఉన్న ఉద్యోగి ఇంతకాలం 14.5 శాతం హెచ్ఆర్ఏ తీసుకున్నారు. ఇప్పుడు అది 8 శాతానికి తగ్గిపోయింది.

ఇదిలా ఉండగా కొత్త జీవో ప్రకారం కొందరికి బకాయిలు ప్రభుత్వం నుంచి వచ్చే అవకాశం ఉంది. గతంలో 12 శాతం హెచ్ఆర్ ఉండి తాజా వేతనాల్లో 8 శాతానికి మారిన ఉద్యోగులు అదనంగా 15వేల వరకు మూలవేతనం పొందనున్నారు. అయితే ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు జీపీఎఫ్లో జమచేస్తారు. ఇక గతంలో 20 శాతం హెచ్ఆర్ ఉన్న వారికి ఇప్పుడు 16 శాతం ఉన్ననగరాల్లోని ఉద్యోగులు సైతం అదనంగా 25 వేలకు పైగా బకాయిలు పొందుతారు.