Begin typing your search above and press return to search.

ఇండియాపై సైబర్ దాడులు

By:  Tupaki Desk   |   17 Jun 2022 1:30 PM GMT
ఇండియాపై సైబర్ దాడులు
X
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైబర్ ముఠాలు ఒక్కసారిగా భారత్ పై దాడులు మొదలుపెట్టాయి. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ దాడి చేస్తున్నది ముస్లిం తీవ్రవాద సంస్ధలు లేదా వాటికి మద్దతుగా నిలబడుతున్న సంస్థల పనే అని నిపుణులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే బీజేపీ మాజీ జాతీయ అధికారప్రతినిది నుపూర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగానే ఈ దాడులు జరుగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం అనుమానిస్తోంది.

నూపుర్ చేసిన వ్యాఖ్యలకు ముస్లిం సమాజం బాగా మండిపోతోంది. నుపూర్ వ్యాఖ్యలపై 56 ముస్లిం దేశాలు నిరసనలు వ్యక్తం చేయడం, దానికి కేంద్ర ప్రభుత్వం క్షమాపణలు చెప్పటం అయిపోయింది.

కొన్ని దేశాలు ఆ దేశాల్లో పనిచేస్తున్న భారత రాయబారులను పిలిచి మరీ తమ అభ్యంతరాలను, నిరసనలు తెలిపాయి. ఈ నేపధ్యంలోనే హఠాత్తుగా సీన్లోకి తాలిబన్లు ఎంటరయ్యారు.

మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ప్రతీకారంగా భారత్ పై మానవ బాంబులతో దాడులు చేయాలని పిలుపిచ్చాయి. ఢిల్లీ, ముంబాయ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ లాంటి చోట్ల మానవ బాంబులతో దాడులు చేస్తామని చేసిన హెచ్చరికలు అందరికీ తెలిసిందే. ఒకవైపు ఇలాంటి వార్నింగులు ఇస్తున్న సమయంలోనే ఎవరూ ఊహించని రీతిలో సైబర్ దాడులు మొదలయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేటు సంస్ధలకు చెందిన 1400 అధికారిక వెబ్ సైట్లు హ్యాకింగ్ కు గురయ్యాయి.

ఎప్పుడైతే కేంద్ర, రాష్ట్రాలకు చెందిన వెబ్ సైట్లు హ్యాకింగ్ కు గురయ్యాయని గుర్తించిన వెంటనే కేంద్రం అప్రమత్తం చేసింది. మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్ ప్రభుత్వాల వెబ్ సైట్లు హ్యాక్ అయినట్లు ఆ ప్రభుత్వాలు ప్రకటించాయి. వందలాది ప్రైవేటు సంస్ధల వెబ్ సైట్లు కూడా హ్యాక్ అయినా తమ విశ్వసనీయత దెబ్బతింటాయనే అవి చెప్పుకోవటం లేదు.

వెబ్ సైట్లోని అధికారిక సమాచారాన్ని తీసేసి తమిష్టం వచ్చిన సమాచారాన్ని సైబర్ దాడులు చేసిన సంస్ధలు నింపేస్తున్నాయి. దీంతో జనాల్లో గందరగోళం పెరిగిపోతోంది. పరిస్ధితి అదుపులోకి వచ్చేంతవరకు అప్రమత్తంగా ఉండాలని, అదనపు సైబర్ జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం హెచ్చరిస్తోంది.