Begin typing your search above and press return to search.
చంద్రబాబు, లోకేశ్ పై సైబర్‌క్రైమ్ కేసు..!
By: Tupaki Desk | 11 April 2021 7:34 AM GMTటీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి, నారా లోకేశ్ పై విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల టీడీపీ అధికారిక ఫేస్బుక్ ఖాతాలో వైసీసీ అభ్యర్థి గురుమూర్తిపై అసభ్యకర పోస్టులు పెట్టారని వైసీసీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాపట్ల ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, కైలే అనిల్‌కుమార్.. డీజీపీ సవాంగ్ కు ఫిర్యాదు చేశారు.
సైబర్ క్రైం పోలీసులు చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ పై కేసు నమోదు చేశారు.
ప్రస్తుతం లోకేశ్ తిరుపతి పార్లమెంట్ పరిధిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయన తండ్రి చంద్రబాబునాయుడు కూడా తిరుపతి పార్లమెంట్ పరిధిలోనే ప్రచారం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల టీడీపీ అధికారిక సోషల్‌మీడియాలో తిరుపతి వైసీపీ అభ్యర్థి గురుమూర్తి పై అనుచిత పోస్టులు పెట్టినట్టు సమాచారం. వెంటనే అలర్టయిన వైసీసీ నేతలు కేసులు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. లోకేశ్ తన అధికారిక ఫేస్బుక్ ఖాతాలో వైసీపీ అభ్యర్థి, దళితుడైన గురుమూర్తిని అవమానించేలా పోస్టు పెట్టారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా సమర్పించారు. లోకేశ్ పై వెంటనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని వైసీపీ నేతలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రస్తుతం లోకేశ్ తిరుపతి పర్యటనలో ఉన్నారు. ఇప్పటికే తిరుపతిలో జనసేనాని పవన్ కల్యాణ్ సభ ముగిసిన విషయం తెలిసిందే. మరోవైపు లోకేశ్, చంద్రబాబు నాయుడు కూడా జోరుగా ప్రచారం చేస్తున్నారు. సీఎం జగన్ మాత్రం కరోనా కారణంగా ప్రచారంలో పాల్గొనడం లేదు. రోజురోజుకు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తాను ప్రచారంలో పాల్గొనడం లేదని... ప్రజలంతా వైసీపీ అభ్యర్థి గురుమూర్తికి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఇదిలా ఉంటే లోకేశ్ మాత్రం సీఎం జగన్‌పై ఆరోపణలు చేస్తున్నారు. ప్రధానంగా వివేకా హత్యను తెరమీదకు తీసుకొస్తున్నారు. లోకేశ్ పై వైసీపీ మంత్రులు, నేతలు సైతం తమదైన స్టయిల్ లో పంచ్ లు వేస్తున్నారు. పవన్ పర్యటన తర్వాత బీజేపీ లో జోష్ పెరిగినప్పటికీ .. ఆ పార్టీకీ పెద్దగా క్యాడర్ లేకపోవడంతో ప్రచారంలో వెనకబడింది.