Begin typing your search above and press return to search.

గర్భిణీలే టార్గెట్ .. సైబర్ క్రైం‌ గ్యాంగ్ గుట్టురట్టు!

By:  Tupaki Desk   |   2 Dec 2020 11:30 PM GMT
గర్భిణీలే టార్గెట్ .. సైబర్ క్రైం‌ గ్యాంగ్ గుట్టురట్టు!
X
ప్రభుత్వ పథకాల పేరుతొ నిండు గర్భిణులను మోసగించటానికి ప్రయత్నించిన ఓ సైబర్ క్రైం‌ గ్యాంగ్‌ గుట్టు వెలుగులోకి వచ్చింది. ఆన్ లైన్‌ బ్యాంకింగ్‌ చీటింగ్‌ కేసులో అరెస్టయిన గ్రూపు నాయకుడిని విచారించగా ఈ వ్యవహారం బయటపడింది. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబైలో చోటుచేసుకుంది.

ఈ ఘటన పై పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ముంబైకి చెందిన ఎనిమది మంది సభ్యుల సైబర్‌ క్రైం గ్రూపు దాదాపు 150 మంది బ్యాంక్‌ అకౌంట్ల వివరాలను తెలుసుకుంది. ఆ తర్వాత వారి అకౌంట్లలోని డబ్బులను ఇతర ఖాతాలకు బదిలీ చేసి, మోసగించింది. ఈ నేపథ్యంలో బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు గ్రూపు నాయకుడు గుణిలాల్‌ మండల్‌ను అరెస్ట్‌ చేశారు. అతడి వద్దనుంచి 100 ఫోన్ నెంబర్లు కలిగిన నోట్‌బుక్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఈ సైబర్‌ క్రైం గ్రూపు ప్రభుత్వ పథకాల ద్వారా 2,500 రూపాయలు వస్తాయంటూ బిహార్‌, జార్ఖండ్‌లలోని గర్భిణుల అకౌంట్‌ వివరాలు సేకరించింది. అనంతరం వారి ఖాతాలలోని డబ్బు మాయం చేయటానికి ప్రయత్నించింది. ఇలోపే పోలీసులు గుణిలాల్‌ను అరెస్ట్‌ చేయటంతో పథకం విఫలమైంది. దాదాపుగా వారి వద్ద వంద మంది గర్భిణీల బ్యాంకు వివరాలు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు.