Begin typing your search above and press return to search.
పోలీసులను టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు.. ఈ సారి తిరుమల!!
By: Tupaki Desk | 26 Sep 2020 11:30 PM GMTగత కొంతకాలంగా పోలీసులు సైబర్ నేరగాళ్లను టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే. పోలీసుల పేరుతో నకిలీ ఫేస్‌బుక్ ఖాతాలు ఓపెన్ చేయడం.. వాటి నుంచి పోలీసు అధికారుల స్నేహితులతో చాట్ చేస్తూ సైబర్ నేరగాళ్లు లక్షల రూపాయలు దోచుకుంటున్నారు. హైదరాబాద్ - నెల్లూరు - కర్నూల్ జిల్లాల్లో గతంలో ఈ ముఠా రెచ్చిపోయంది. అయితే సైబర్ ముఠా తాజాగా ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల మీద పడింది. గతంలో ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి మోసాలకు పాల్పడ్డ సైబర్ దొంగలు ఈ సారి రూటు మార్చారు. ఏకంగా పోలీస్ అధికారుల అకౌంట్లనే హ్యాక్ చేశారు. హ్యాక్ చేసిన అకౌంట్ల నుంచి లిస్ట్‌లో ఉన్న స్నేహితులకు మెసెంజర్లో అర్జంటుగా డబ్బులు కావాలంటూ మెసేజ్‌లు పంపుతున్నారు.
కొంతమంది పోలీసులకు డౌట్ వచ్చి సహచర పోలీసులకు ఫోన్ చేయడంతో ఈ బండారం బయటపడింది. తిరుమల, తిరుపతికి చెందిన చాలా మంది పోలీస్ అధికారుల ఫేస్‌బుక్ అకౌంట్లను సైబర్ ముఠా హ్యాక్ చేసినట్టు సమాచారం.
సీఐలు రామకృష్ణ, సాయిగిరిధర్.. ఎస్సైలు తిమ్మయ్య, సుమతి ఫేస్‌బుక్ అకౌంట్లు హ్యాక్ చేసిన దుండగులు.. డబ్బులు దండుకునే ప్రయత్నం చేశారు. దీంతో తిరుపతి, తిరుమల పోలీసులు ప్రెస్‌మీట్ పెట్టి ఈ విషయాన్ని చెప్పారు. పలువురు పోలీస్ అధికారుల సోషల్‌మీడియా ఖాతాలను సైబర్ దుండగులు హ్యాక్ చేశారని.. వారి పేరుమీద వచ్చే మెసేజ్‌లకు ప్రజలెవరూ స్పందించవద్దని.. అనుమానం వస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని వారు కోరారు. మరోవైపు తిరుపతి సైబర్‌క్రైం పోలీసులు ఇప్పటికే రంగంలోకి దిగారు. హ్యాకర్లు ఏ ఐడీ నుంచి వీటిని హ్యాండిల్ చేస్తున్నారో కనుక్కొనేందుకు ముమ్మరంగా యత్నిస్తున్నారు.