Begin typing your search above and press return to search.
ప్రముఖులైనా.. సాధారణ ప్రజలైనా.. సైబర్ హ్యాకర్లకు ఒకటే
By: Tupaki Desk | 13 Dec 2021 1:30 AM GMTప్రస్తుతం దేశంలో ఏ మూల చూసినా సైబర్ హ్యాకర్ల ఆగడాలే. చదువు రాని వారి నుంచి విద్యావంతులు, ప్రముఖుల దాక అందరూ బాధితులే. రోజుకు కొన్ని వందల కేసులు నమోదవుతున్నాయంటే ఆశ్చర్యం లేదు. లెక్కలోకి రానివి.. పరువు పోతుందని బయటకు చెప్పనివి ఎన్నో? ఇలా లక్షలకు లక్షలు పోగొట్టుకున్నవారు ఎందరో? అలాంటి వారి జాబితాలో మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఒకరు. కాంబ్లీ ప్రస్తుతం కోచ్ గా వ్యవహరిస్తూ ముంబైలోనే నివసిస్తున్నారు. ఈనెల 3న అతడికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. బ్యాంక్ అధికారినంటూ ఫోన్ చేసిన ఓ వ్యక్తి.. కేవైసీ వివరాలను వెంటనే అప్ డేట్ చేయాలని, లేకుంటే క్రెడిట్, డెబిట్ కార్డులు డీయాక్టివేట్ అవుతాయని చెప్పాడు. ఆ మాటలు నమ్మిన కాంబ్లి.. మొబైల్ లో ఎనీ డెస్క్ యాప్ ను ఇన్ స్టాల్ చేశాడు. అంతే..కాంబ్లీ బ్యాంక్ అకౌంట్ నుంచి పలు దఫాలుగా రూ.1.14 లక్షలు మరో అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ అయ్యాయి. అప్పుడుగానీ తాను మోసపోయినట్లు గుర్తించలేదు. కాంబ్లీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సత్వరమే బ్యాంక్ అధికారులను సంప్రదించారు. సైబర్ నేరాల విభాగం అప్రమత్తమై.. అతడి అకౌంట్ నుంచి ఏ అకౌంట్ లోకి డబ్బులు బదిలీ అయ్యాయో గుర్తించి, రివర్స్ ట్రాన్సాక్షన్న్ ద్వారా ఆ డబ్బును తిరిగి జమ చేశారు. పోయిందనుకున్న డబ్బు తిరిగిరావడంతో కాంబ్లీ ఊపిరిపీల్చుకున్నాడు.
ఎనీ డెస్క్ యాప్.. ఎనీ టైం మోసం ప్రస్తుతం సైబర్ నేరగాళ్ల ప్రధాన ఆయుధం.. ఎనీ డెస్క్ యాప్. దీని ద్వారా అవతలి వ్యక్తి పరికరాన్నిపూర్తిగా అదుపులోకి తీసుకోవచ్చు అలా కాంబ్లి అకౌంట్ ను కబ్జా చేసిన సైబర్ నేరగాళ్లు డబ్బులు దోచేశారు. ఈ విషమై కాంబ్లి వెంటనే బాంద్రా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే,ఎవరైనా సైబర్ మోసానికి గురైన వెంటనే పోలీసులను ఆశ్రయించాలని, 24 గంటల్లోపు ఫిర్యాదు చేస్తే పోగొట్టుకున్న డబ్బు తిరిగి లభించే అవశాలుంటాయని పోలీసులు చెబుతున్నారు.
సచిన్ తో సమానంగా పేరు.. కానీ, కాంబ్లీ.. మూడు దశాబ్దాల క్రితం సచిన్ తెండూల్కర్ తోపాటు అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టాడు. తొలినాళ్లలో సచిన్ తో సమానంగా పేరు తెచ్చుకున్నాడు. ప్రతిభలో ఇద్దరూ సమఉజ్జీలే. ఓ దశలో వరుసగా రెండు టెస్టు డబుల్ సెంచరీలతో అదరగొట్టాడు. అయితే, ఫామ్ కోల్పోవడానికి తోడు కాంబ్లీ తన ప్రవర్తనతో టీమిండియాకు దూరమయ్యాడు. తద్వారా ఓ సాధారణ క్రికెటర్ గా మిగిలిపోయాడు.