Begin typing your search above and press return to search.
సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సతీష్ హత్య.. ఇలా జరిగింది..
By: Tupaki Desk | 3 Sep 2019 6:46 AM GMTసాఫ్ట్ వేర్ ఇంజనీర్ సతీష్ బాబు హత్య కేసులో అనుమానిస్తున్న ప్రధాన నిందితుడు.. అతడి ప్రాణ స్నేహితుడిని తాజాగా సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. సతీష్ ను తాను ఒక్కడే హత్య చేశానని.. ఇందులో తన ప్రియురాలు ప్రియాంకు ఎలాంటి సంబంధం లేదని హేమంత్ పోలీసులకు చెప్పినట్టు తెలిసింది..
హేమంత్ ను విచారించిన పోలీసులు కీలక సమాచారం రాబట్టినట్టు తెలిసింది. గత నెల 27న సతీష్ తన ఆఫీసులో పనిచేసే ప్రియాంకను హాస్టల్ లో డ్రాప్ చేశాడు. రాత్రి 8 గంటలకు హేమంత్ రూమ్ కు వెళ్లాడట. ఇద్దరూ కలిసి మద్యం తాగారు. మాటల మధ్యలో ఆఫీసులో పనిచేస్తున్న అమ్మాయితో హేమంత్ కు ఉన్న వివాహేతర సంబంధం చర్చకు వచ్చిందట.. దీన్ని మానుకోవాలని హేమంత్ ను సతీష్ హెచ్చరించినట్టు తెలిసింది.
మద్యం మత్తులో ఉన్న హేమంత్ ఈ విషయాన్ని సతీష్ ఆఫీసులో బయటా చెబుతాడని భయపడ్డాడు. అడ్డుతొలగించుకుందామనే రాత్రి 10 గంటలకు కత్తితో సతీష్ మెడకోసం చంపినట్టు పోలీసుల విచారణలో ఒప్పుకున్నట్టు సమాచారం. అనంతరం బాడీని లేకుండా చేయాలని ముక్కులుగా నరకాలని భావించాడు. ప్యాకింగ్ కోసం నల్లటి కవర్లు కొని తీసుకొచ్చాడు.
అయితే కాలు నరకడానికి ప్రయత్నించి సాధ్యం కాకపోవడంతో శవాన్ని అక్కడే వదిలి పారిపోయాడట.. రాత్రంతా రోడ్లపైనే గడిపి.. అనంతరం హత్య విసయాన్ని తన స్నేహితులకు చెప్పినట్టు వివరించాడట..
స్నేహితులు పోలీసులకు లొంగిపోవాలని చెప్పడంతో హేమంత్ వినలేదు. బంధువుల ఇంట్లో తలదాచుకున్నాడు. సతీష్ భార్య ఫిర్యాదులో పోలీసులు హేమంత్ కోసం గాలించగా సోమవారం రాత్రి పోలీసులకు చిక్కాడు. విచారణలో హత్యచేసినట్టు ఒప్పుకున్నట్టు తెలిసింది.