Begin typing your search above and press return to search.
ఆన్ లైన్ మోసాలు.. మళ్లీ లైన్లోకి వచ్చేసిన బ్రహ్మానందం!
By: Tupaki Desk | 4 March 2021 7:37 AM GMTతెలుగు తెరపైనే కాదు.. ఆన్ లైన్ స్క్రీన్ పైనా బ్రహ్మానందం క్రేజ్ మామూలుగా ఉండదు. ఆయన చాలా రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారుగానీ.. ప్రేక్షకులకు మాత్రం అతి దగ్గరగానే ఉన్నారు! ప్రధానంగా సోషల్ మీడియాలో బ్రహ్మీ ఫొటోలు, మీమ్స్ నిత్యం వేలాదిగా షేర్ అవుతుంటాయి. ఎలాంటి ఎక్స్ ప్రెషన్ కావాలన్నా.. బ్రహ్మీ పిక్ ద్వారా వ్యక్తంచేస్తుంటారు నెటిజన్లు. అందుకే.. ఆయన క్రేజ్ వాడుకుంటున్న పోలీసులు.. జనాలకు నాలుగు మంచి మాటలు చెప్పిస్తుంటారు. ఇప్పటికే పలుమార్లు ఈ పనిచేసిన బ్రహ్మీ.. తాజాగా మరోసారి లైన్లోకి వచ్చారు.
సాంకేతిక ఇంతగా విస్తరించిన ఈ రోజుల్లోనూ జనాలు ఆన్ లైన్ మోసాలకు గురవుతున్నారు. ఉద్యోగం పేరుతోనూ, లాటరీ పేరుతోనో వలవేస్తున్న కేటుగాళ్లకు.. అత్యాశాపరులు చిక్కిపోతున్నారు. దీంతో ఒక్కోసారి సర్వం పోగొట్టుకుంటున్నారు. ఆ తర్వాత లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో జనాల్లో అవేర్ నెస్ పెంచేందుకు బ్రహ్మానందం ద్వారా అవగాహన కల్పిస్తున్నారు.
ఈ మధ్యనే బ్యాంకు అధికారులు, పోలీసులు కలిసి ఓ వీడియో చేశారు. బ్యాంకు అకౌంట్ డీటెయిల్స్, ఏటీఎం పిన్ నంబర్ వగైరా వివరాలను బ్యాంకు అధికారులు ఎప్పటికీ అడగరని బ్రహ్మీతో చెప్పించారు. తాజాగా.. ఆన్ లైన్ మోసాలకు సంబంధించి.. బ్రహ్మానందం నటించిన చిత్రాల్లోని కామెడీ క్లిప్స్ తో కలిపి ఓ వీడియో రూపొందించారు. వాటిలో నేరగాళ్లు ఎలా వలవేస్తారు.. ఎలా ఆశచూపిస్తారు.. ఫైనల్ గా ఎలా బురిడీ కొట్టిస్తారనే విషయాన్ని ఫన్నీగా చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
కాగా.. ఇంత ప్రచారం చేస్తున్నా, ఎన్నెన్ని మోసాలు వెలుగు చూస్తున్నా.. జనం ఇంకా ఆన్ లైన్ మోసాలకు గురవుతుండడం గమనార్హం. తాజాగా తెలుగు సినిమా దర్శకుడు వెంకీ కూడా మోసపోయారు. తన సినిమాను అంతర్జాతీయ వేదికలో ప్రదర్శిస్తామని ఎవరో అగంతకుడు ఫోన్ చేసి చెప్పగా.. ఆయన నమ్మేశాడు. అంతేకాదు.. ఎంట్రీ ఫీజు అంటూ రూ.66 వేలు చెల్లించారు కూడా. ఆ తర్వాత విషయం తెలుసుకొని పోలీసును ఆశ్రయించారు.

Beware Of Fraud Jobs pic.twitter.com/45c11YmqcA
— హైదరాబాద్ సిటీ పోలీస్ Hyderabad City Police (@hydcitypolice) March 3, 2021