Begin typing your search above and press return to search.

సైకిల్ స్వర్గం.. మనసు దోచుకునే సైకిల్ మ్యూజియం ఎక్కడో తెలుసా?

By:  Tupaki Desk   |   19 May 2021 12:30 AM GMT
సైకిల్ స్వర్గం.. మనసు దోచుకునే సైకిల్ మ్యూజియం ఎక్కడో తెలుసా?
X
పేదవాళ్ల బుల్లెట్ ఏంటి అంటే సైకిల్. మోటార్ బైకులు రానికాలంలో రెడ్ల మీదకు వచ్చిన ద్విచక్రవాహనం ఏంటంటే సైకిల్. పిల్లలూ, పెద్దలూ ఉపయోగించే రెండు చక్రాల బండి సైకిల్. అలాంటి సైకిల్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అయితే పాతతరం సైకిళ్లు, కొత్తతరంలో మార్పులు వచ్చిన సైకిళ్లు అన్నీ ఒక ప్రాంతంలోనే చూడొచ్చు. నేడు అంతర్జాతీయ మ్యూజియం డే. కాబట్టి ఆ సైకిల్ స్వర్గం గురించి మనమూ తెలుసుకుందాం రండి.

అమెరికాలోని పెన్సెల్వేనియా పిట్స్ బర్గ్ లో క్రెయింగ్ మోరో అనే వ్యక్తి సైకిల్ హెవెన్ పేరిట ఓ మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు మూడు దశాబ్దాల సైకిళ్లను, నమూనాలను సేకరించి ఏడేళ్ల కిందట ఈ సైకిళ్ల స్వర్గాన్ని ప్రారంభించారు. ప్రపంచంలోనే అతిపెద్ద సైకిల్ మ్యూజియం ఇదే కావడం గమనార్హం.

పూర్వకాలంలో సైకిళ్లు, వాటి అమరిక, నమూనాల నుంచి నేటి కొత్త సైకిళ్లనూ ఒకే దగ్గర చూడొచ్చు. ఈ రెండు చక్రాల బండిలో కాలక్రమంలో వచ్చిన మార్పులను కళ్లకు కట్టినట్లుగా చూసేయొచ్చు. సైకిల్ హెవెన్ పేరుకు తగ్గట్లుగానే దీనిని అందంగా తీర్చి దిద్దారు.

ఎటు చూసినా సైకిల్ మయమే. పైకప్పులు, గోడలు, నేల అంతా కూడా సైకిళ్లతోనే అమర్చారు. ఎక్కడికక్కడ సైకిళ్లను పొందికగా అమర్చారు. ఆ సైకిళ్లన్నీ ఒకేసారి చూస్తే మనసు ఉండలేదు. అన్ని సైకిళ్లను ఓ రౌండ్ తొక్కాలని మనసు తహతహలాడుతుంది. ఈ సైకిల్ స్వర్గాన్ని సందర్శించడానికి పర్యాటకులు ఆసక్తి కనబర్చుతున్నారు.