Begin typing your search above and press return to search.
యాక్సిడెంట్ కంటే దారుణం..
By: Tupaki Desk | 17 July 2016 7:24 AM GMT‘‘మాయమైపోతున్నడమ్మో.. మనిషన్నవాడు’’ అన్న పాట గుర్తుండే ఉంటుంది. ఆ మాటలు నిజమే అని నిత్యం ఏదో ఒక సంఘటన నిరూపిస్తోంది. తాజాగా కృష్ణాజిల్లా పునాదిపాడులో జరిగిన దారుణం మరోసారి నిరూపించింది. మనిషిలో రాక్షషత్వం పెరిగి సామరస్యం తగ్గిపోతుందని ఈ ఘటన రుజువు చేసింది. ఎదురుగా వచ్చి వాహనంతో ఢీకొన్నాడని ఆవేశంతో పిడి గుద్దులు గుద్ది ఓ వ్యక్తిని చంపేసిన సంఘటన కలకలం రేపింది. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో వాస్తవాలు ఆలస్యంగా వెలుగుచూశాయి.
కంకిపాడు మండలంలోని పునాదిపాడు గ్రామపంచాయతీ కార్యాలయం సమీపంలోని సెంటర్ వద్ద సైకిల్ - టివియస్ ఎదురెదురుగా చిన్నపాటి యాక్సిడెంట్ జరిగింది. దీంతో సైకిల్ పై ఉన్న వ్యక్తి అతి కిరాతకంగా టివియస్ పై ఉన్న వ్యక్తిని రోడ్డుపై పడవేసి కొట్టాడు. దీంతో ఆ ద్విచక్రవాహనదారు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు. యాక్సిడెంట్ జరిగిన ప్రాంతంలోని సీసీ కెమేరాల్లో రికార్డయిన దృశ్యాల వల్ల అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో మృతుడి బంధువులు కంకిపాడు పోలీసుస్టేషన్ ను ముట్టడించి - రోడ్డుపై రాస్తారోకోకు దిగారు.
పమిడిముక్కల మండలంలోని గడ్డిపాడు గ్రామానికి చెందిన కొల్లూరు సాంబశివరావు కోలవెన్నులో స్థిరపడి విజయవాడ సిద్ధార్థ కాలేజిలో సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం చేస్తున్నాడు. శుక్రవారం రాత్రి చిన్న కుమారుడు క్రాంతి కుమార్ కు జ్వరం రావడంతో చికిత్స నిమిత్తం కంకిపాడు వచ్చి తిరిగి వెళ్తుండగా పునాదిపాడు సెంటర్ కు చేరుకోగానే ఎదురుగా గ్రామానికి చెందిన దేవరపల్లి కిరణ్ కుమార్ సైకిల్ స్వల్పంగా ఢీకొన్నాయి. దీంతో సైకిల్ పై ఉన్న కిరణ్ కుమార్ - సాంబశివరావును అతి పాశవికంగా పిడిగుద్దులతో రోడ్డుపై పడేసి కొట్టాడు. దీంతో సాంబశివరావు అపస్మారస్థితికి చేరుకున్నాడు. వెంటనే సాంబశివరావు బంధువులు విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించిన అనంతరం స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సిఐ శ్రీ్ధర కుమార్ చొరవతో ప్రైవేటు ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యానికి ప్రయత్నించారు. అయినా ప్రయత్నం ఫలించకపోవడంతో సాంబశివరావు మృతి చెందాడు. కాగా చిన్నపాటి యాక్సిడెంట్ కే ఎదుటి వ్యక్తిని చితకాబాది చంపేసిన దేవరపల్లి కిరణ్ కుమార్ ను అదపులోకి తీసుకుని పోలీసులు హత్య కేసు నమోదు చేశారు.