Begin typing your search above and press return to search.
తుఫాను ఎఫెక్ట్: ప్రజలకు పవన్ కళ్యాణ్ పిలుపు!
By: Tupaki Desk | 11 May 2022 10:30 AM GMTరాష్ట్రంలో నెలకొన్న అసని తుపాను ప్రభావం కోస్తా జిల్లాల్లో ముఖ్యంగా గోదావరి జిల్లాల మీద తీవ్ర స్థాయిలో కనిపిస్తోందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ సూచించారు. ఈ ప్రకృతి విపత్తు బారినపడే వారిని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు.
అసని తుపాను ప్రభావం కోస్తా జిల్లాల్లో.. ముఖ్యంగా గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాలపై తీవ్ర స్థా యిలో కనిపిస్తోందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ సూచించారు. ఈ ప్రకృతి విపత్తు బారినపడే వారిని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు.
అనేక గ్రామాల్లో ధాన్యం కళ్లాల్లోనే ఉండటంతో రైతులు ఆందోళనలో ఉన్న విషయం తన దృష్టికి వచ్చిందని, ప్రభుత్వం తక్షణం స్పందించి రైతులకు భరోసా ఇవ్వాలని పవన్‌కల్యాణ్ డిమాండ్ చేశారు. ధాన్యం సేకరణలో నిబంధనలు సడలించాలని కోరారు.
17శాతం మించి తేమ ఉండకూడదనే నిబంధన ఈ సమయంలో వర్తింపజేస్తే రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారు. తడిచిన, రంగు మారిన ధాన్యాన్ని కచ్చితంగా కొనుగోలు చేయాలని కోరారు.
అసని ప్రభావం వల్ల పండ్ల తోటలు, ఉద్యాన పంటలు వేసిన రైతులు కూడా దెబ్బ తిన్నారని పవన్ అన్నారు. పరిహారాన్ని తక్షణమే లెక్కించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తీరంలోని మత్స్యకార గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇళ్ళు దెబ్బ తిన్నవారిని ఆదుకోవాలని కోరారు. జనసైనికులు, పార్టీ నాయకులు బాధితులకు బాసటగా నిలవాలని పవన్‌కల్యాణ్ సూచించారు.