Begin typing your search above and press return to search.

'ఫొని' కి 21మంది బలి.. అంతా అంధకారం

By:  Tupaki Desk   |   5 May 2019 10:31 AM GMT
ఫొని కి 21మంది బలి.. అంతా అంధకారం
X
బంగాళాఖాతంలో పుట్టిన పెనుతుఫాన్ ‘ఫొని’ కారణంగా ఒడిషా తీవ్రంగా నష్టపోయింది. ముఖ్యంగా పూరీ జిల్లాలో ఫొని విలయతాండవానికి 21మంది మరణించినట్టు పూరి జిల్లా కలెక్టర్ అధికారంగా ఈరోజు ప్రకటించారు. శనివారం నాటికే పూరి - బరిపద - కేంఝార్ - నయాగడ్ లలో 13మంది చనిపోయినట్లు తెలిపారు.

మరోవైపు భారీ వర్షాలతో తీరప్రాంతాలు పూర్తిగా జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. తుఫాన్ ముగిసిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని సంఘటనలు వెలుగులోకి వస్తుండడంతో మృతుల సంఖ్య పెరుగుతోంది. అనేక జిల్లాల్లో భారీ ఆస్తినష్టం సంభవించింది. లక్షల సంఖ్యలో చెట్లు - విద్యుత్ స్తంభాలు - ట్రాన్స్ ఫార్మర్లు - టవర్లు కూలడంతో విద్యుత్ - కమ్యూనికేషన్ సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి.

ఫణి తుఫాన్ నేపథ్యంలో శనివారం ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సమీక్షా సమావేశం నిర్వహించారు. తుఫాన్ బాధితులకు 15రోజుల వరకు సాయం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక ఆదివారం జరగాల్సిన నీట్ పరీక్షను తుఫాన్ ప్రభావానికి గురైన ఒడిషాలో రద్దు చేశారు. ఇక సోమవారం ప్రధాని మోడీ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేపట్టనున్నారు.