Begin typing your search above and press return to search.

తౌక్టే తుఫాను: మునిగిన నౌకలు.. 188 మంది సేఫ్.. 60 మృతదేహాలు స్వాధీనం

By:  Tupaki Desk   |   22 May 2021 5:30 AM GMT
తౌక్టే తుఫాను: మునిగిన నౌకలు.. 188 మంది సేఫ్.. 60 మృతదేహాలు స్వాధీనం
X
మే 17న ముంబై తీరంపై తౌక్డే తుఫాను విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. అరేబియా సముద్రంలో ఈ తుఫాన్ ధాటికి మునిగిపోయిన బార్జ్ పి 305 యాంకర్ పడవ నుండి ఇద్దరు సహా 188 మందిని భారత కోస్ట్ గార్డ్ రక్షించింది.

బార్జ్ నౌక నుంచి 60 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన సిబ్బంది కోసం అన్వేషణ సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ప్రత్యేక బృందాలు మరియు సామగ్రిని ఉపయోగించి బార్జ్ పి 305 శిధిలాలను గుర్తించడానికి ఇండియన్ నేవీ సర్వే షిప్ ద్వారా నీటి అడుగున శోధన మొదలు పెట్టారు. ఐఎన్ఎస్ టెగ్, ఐఎన్ఎస్ బెట్వా, ఐఎన్ఎస్ బియాస్ పి8ఐ విమానం మరియు సీకింగ్ హెలోస్ సెర్చ్ అండ్ రెస్క్యూ టీంలుగా విడిపోయి ఈ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి.

ఎస్ఎస్ -3లో 196 మంది సిబ్బంది, సాగర్ భూషణ్ పై 101 మంది సిబ్బంది సురక్షితంగా ఈ విపత్తు నుంచి బయటపడ్డారు. ఆఫ్‌షోర్ సప్లై వెసెల్స్‌ను ఒఎన్‌జిసి- ఎస్సిఐ టోయింగ్ సంస్థలు అద్దెకు తీసుకొని తమ కార్యకలాపాల కోసం వినియోగిస్తున్నారు. ఐఎన్ఎస్ తల్వార్ కూడా ఈ ప్రాంతంలో ఉంది ”అని రక్షణ శాఖ తెలిపింది.

చమురు మరియు సహజ వాయువు కార్పొరేషన్ (ఒఎన్‌జిసి) ప్రధాన ఉత్పత్తి సంస్థ -డ్రిల్లింగ్ రిగ్‌లు తుఫాను తీవ్రతను చవిచూశాయి. కానీ వీటికి ఎలాంటి నష్టం వాటిల్లలేదని రక్షణ శాఖ తెలిపింది. తౌక్తా తుఫాను ధాటికి ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాలలో కుంభవృష్టి వర్షం కురిసింది.