Begin typing your search above and press return to search.

వరుస తుఫాన్లు.. ఏపీకి హెచ్చరిక

By:  Tupaki Desk   |   26 April 2020 6:51 AM GMT
వరుస తుఫాన్లు.. ఏపీకి హెచ్చరిక
X
మండే ఎండల్లోనూ ఏపీకి ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో భారీ తుపాను ఏర్పడనుందని హెచ్చరించింది. ఈనెల 27 - మే 1 తుపాన్లు ఏర్పడబోతున్నాయని.. ఏపీ అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఈనెల 27న తొలి తుపాను ఏర్పడనుంది. దీని ప్రభావంతో దేశంలోని కోస్తా తీరమంతా అల్లకల్లోలం కానుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ వర్షకాలం సీజన్ కు ముందు ఏర్పడే తొలి తుపాను ఇదేనని తెలిపారు. ఈ తుపానుతో కోస్తా ప్రాంతాన్ని ఆనుకొని ఉండే రాష్ట్రాలలో కుండపోత వర్షాలు - బలమైన గాలులతో అలజడి చెలరేగుతుందని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవుల్లో ఏర్పడే ఈ తుపాను కోస్తా ప్రాంతాలను అతలాకుతలం చేస్తుందని తెలిపింది. ఇక ఈ తుఫాను 28 - 29 - 30 తేదీల్లో వరుస వానలు - బీభత్సం చేస్తుందని వివరించింది. సముద్ర తీర ప్రాంతాలకు డేంజర్ అని హెచ్చరించింది.

ఇక 27న తుపాను ముగిశాక మే 1న ఉత్తర అండమాన్ నికోబార్ దీవులలో మరో తుపాన్ ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దాని ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది.

ఇక ఈ రెండు తుపాన్ల ప్రభావాన్ని తట్టుకునేందుకు ఏపీ సహా తీర ప్రాంత రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.