Begin typing your search above and press return to search.
టౌటే నుంచే బయటకు రాలేదు.. తాజాగా ‘యాస్’ ముప్పు
By: Tupaki Desk | 22 May 2021 3:25 AM GMTపశ్చిమ తీరాన్ని వణికించటంతో పాటు.. మహారాష్ట్ర.. గుజరాత్.. గోవాలతో పాటు పలు రాష్ట్రాల మీద తీవ్ర ప్రభావాన్ని చూపిన టౌటే తుపాను కొట్టిన దెబ్బ నుంచే ఇంకా తేరుకోలేదు.. అప్పుడే మరో తుపాను రంగం సిద్ధమైంది. ఉత్తర అండమాన్ సముద్రానికి అనుకొని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఈ రోజు అల్పపీడనం ఏర్పడనుంది. దీనికి ‘యాస్’ తుపానుగా పేరు పెట్టేశారు. పర్షియన్ పదమైన యాస్ ను ఇంగ్లిషులో జాస్మిన్ అంటారు. అదేనండి మన మల్లెపూవు. చూస్తుంటే.. టౌటే దెబ్బ సరిపోనట్లు తాజాగా మల్లెపూవు మరెంతలా ముంచుతుందో?
ఇది వాయువ్యదిశగా కదులుతూ వాయుగుండంగా.. ఆపై తీవ్ర వాయుగుండంగా మారి ఈ నెల 24కు తుపానుగా మారనుంది. అనంతరం ఇది మరింత తీవ్ర రూపం దాల్చి ఈ నెల 26ఉదయానికి ఒడిశా.. పశ్చిమబెంగాల్ తీరం దాటనుంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ మీద తక్కువ ప్రభావం.. ఒడిశా, పశ్చిమబెంగాల్ మీద తీవ్ర ప్రబావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. యాస్ తుపాను కారణంగా ఏపీలోని ఉత్తర కోస్తాలో వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు.
యాస్ తుపాను నేపథ్యంలో జగన్ సర్కారు అలెర్టు అయ్యింది. పలు మార్గదర్శకాల్ని సిద్ధం చేసింది. తీర ప్రాంతంలో ముందస్తు ఏర్పాట్లను పూర్తి చేయటమే కాదు.. అవసరమైన సహాయక చర్యలకు సిద్ధమవుతోంది. యాస్ తుపాను నేపథ్యంలో వాల్తేర్ డివిజన్ లోని పలు రైళ్లను రద్దు చేస్తూ రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. యాస్ తుపాను తీవ్రతకు ఏపీలోని వాతావరణంలో బోలెడన్ని మార్పులు చోటు చేసుకోవచ్చని భావిస్తున్నారు.
తుపాను కారణంగా ఒడిశా.. పశ్చిమబెంగాల్లో భారీ వర్షాలు కురుస్తాయని.. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఎండలు మరింత తీవ్రం అయ్యేలా చేస్తుందని చెబుతున్నారు. రాబోయే నాలుగు రోజులు సాధరణం కంటే 2 నుంచి 4 డిగ్రీల అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు చెబుతున్నారు. అంతేకాదు.. ఉరుములు.. మెరుపులతో కూడిన వర్షాలు కుస్తాయని భావిస్తున్నారు.