Begin typing your search above and press return to search.
నంద్యాల హోటల్లో పేలిన 3 సిలిండర్లు.. గుడిసెలు, దుకాణాలు దగ్ధం
By: Tupaki Desk | 31 March 2021 4:00 AM GMTఆంధ్రప్రదేశ్లోని కర్నూల్ జిల్లా నంద్యాలలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పట్టణంలోని ఓ హోటల్లో మూడు సిలిండర్లు ఒక్కసారిగా పేలి మంటలు చెలరేగాయి. పెద్ద పెద్ద శబ్ధాలతో స్థానికంగా కలకలం సృష్టించాయి. పక్కనే ఉన్న సర్కిల్ వరకు ఈ అగ్నికీలలు వ్యాపించాయి.
నిరాశ్రయులు
హోటల్లో మంటలు చెలరేగుతూ సర్కిల్ పక్కనే ఉన్న గుడిసెలకు మంటలు వ్యాపించాయి. అసలే వేసవి కాలం... ఒక్కసారిగా అగ్ని కీలలు వ్యాపించడంతో పూరిళ్లు దగ్ధమయ్యాయి. వాటిలోని సామాగ్రి అంతా అగ్నికి ఆహూతైంది. కాగా బాధితులు నిరాశ్రయులయ్యారు. అంతేకాకుండా స్థానికంగా ఉన్న దుకాణాలు, హోటళ్లకు ఈ మంటలు వ్యాపించాయి.
స్థానికంగా కలకలం
భారీ మంటలతో స్థానికుల ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన సిబ్బంది సంఘటన స్థలానికి వచ్చి మంటలు అదుపు చేసే ప్రయత్నం చేశారు. మండే ఎండల దృష్ట్యా మంటలు ఆర్పడం కష్టంగా మారిందని అధికారులు తెలిపారు.
జాగ్రత్త అవసరం
ఈ భారీ అగ్నిప్రమాదంతో నంద్యాల, నందికొట్కూరు రహదారిలో ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. ఈ సంఘటనకు గల కారణాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని సమాచారం. వేసవి కాలం వచ్చినందున అగ్ని ప్రమాదాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.