Begin typing your search above and press return to search.
బుజ్జితల్లి ఎన్ని కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చిందో?
By: Tupaki Desk | 8 July 2016 1:01 PM GMTఇది ఎంత మాత్రం కోర్టుల మీదనో.. న్యాయమూర్తులపైనో కోపంతోనో.. ఆగ్రహంతోనే రాస్తున్న కథనం కాదు. తాజాగా చోటు చేసుకున్న ఉదంతంపై న్యాయవ్యవస్థలో తీసుకురావాల్సిన మార్పుల గురించి చర్చ జరగాలన్న ఉద్దేశంతో రాస్తున్న కథనమే. మానవతా దృక్ఫదంతో వ్యవహరించాల్సిన సమయాల్లో నిబంధనల చిక్కుముడులను విడదీయాల్సిన బాధ్యత ఎవరిది? అన్న సందేహంతో చెబుతున్న మాటలే తప్ప మరొకటి కాదు. ఈ వివరణ అంతా ఎందుకంటే.. ఆవేదన.. ఆక్రోశంగా వినిపిస్తే బాగుంటుంది కానీ.. అంతకు భిన్నంగా ఉంటేనే ఇబ్బంది. ఇక.. ఈ విషయాన్ని కట్ చేస్తే..
కొన్ని సినిమాల్లో ఒక సీన్ తరచూ కనిపిస్తూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాల్లో ఇలాంటి సీన్లు తక్కువగా ఉంటున్నాయి కానీ.. గతంలో ఈ తరహా సన్నివేశాలు తరచూ తరచూ కనిపిస్తూ ఉండేవి. ఏదైనా నేరం జరిగిన వెంటనే.. తమకు జరిగిన అన్యాయం గురించి ఫిర్యాదు చేయటానికి వచ్చిన వారికి రూల్స్ చెబుతూ.. తమ పరిధిలో సదరు నేరం జరగలేదు కాబట్టి.. తామేమీ చేయలేమని చెప్పేయటం కనిపిస్తుంది. ఇలాంటివి పోలీస్ స్టేషన్లోనే కాదు.. న్యాయస్థానాల్లో కూడా చోటు చేసుకుంటాయా? అన్న సందేహం కలిగే పరిస్థితి.
కారణాలు ఏమైనా కానీ.. తల్లిదండ్రుల మధ్య జరిగిన గొడవ ఊహించని మలుపులు తిరిగి తల్లి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోతే.. ఆ దుర్మార్గానికి కారణమైన తండ్రి ఇప్పుడు జైలు ఊచలు లెక్కిస్తున్న పరిస్థితి. ఈ రెండింటితో ఏ మాత్రం సంబంధం లేకున్నా.. ఏడేళ్ల చిట్టి తల్లి మాత్రం తానిప్పుడు ఎక్కడ ఉండాలో తెలియక పోలీసులు వెంట కోర్టుల చుట్టూ తిరుగుతున్న దుస్థితి చూస్తే.. కడుపు తరుక్కుపోయే పరిస్థితి. నిన్నమొన్నటి వరకూ స్కూల్ కాకుండా అయితే.. ఫ్రెండ్స్ తో ఆడుకోవటానికి కాదంటే.. తల్లిదండ్రులతో కలిసి సూపర్ మార్కెట్లు.. మల్టీఫ్లెక్సులు.. రెస్టారెంట్లు.. ఐస్ క్రీం పార్లర్లకు మాత్రమే వెళ్లి ఉండి ఉంటుంది. కానీ.. ఈ రోజు మాత్రం కోర్టు చుట్టూ తిరుగుతున్న పరిస్థితి. కాలం ఇలాంటి మార్పులు తెచ్చి పెట్టిందని సరిపెట్టుకోవచ్చు కానీ.. రూల్స్ పేరిట ఒక కోర్టు నుంచి మరో కోర్టుకు తిప్పటమే అసలు అభ్యంతరమంతా. ఇదంతా చదివేటప్పటికి దేని గురించి ఇదంతా అన్న విషయం ఇప్పటికే అర్థమై ఉంటుంది.
కాంగో దేశస్తురాలైన సింథియాను భర్త రూపేశ్ ముక్కలుముక్కలుగా నరికి చంపటం.. పోలీసులకు దొరికిపోయిన అతడ్ని జైలుకు తరలించగా.. వారి ఏడేళ్ల సానియాను ప్రభుత్వ సంరక్షణలో ఉంచారు. తొలుత నానమ్మ దగ్గరే ఉంచినా.. అమ్మ తరఫు వారు వచ్చి చిన్నారిని తమతో పంపాలని భారీగా ఆందోళనలు చేపట్టిన నేపథ్యంలో ఈ విషయంపై తామేమీ చేయలేమని.. కోర్టు నిర్ణయం ప్రకారం వెళతామంటూ సానియాను తీసుకొని శుక్రవారం ఉదయం రాజేంద్ర నగర్ కోర్టుకు తీసుకెళ్లారు. ఈ కేసు తమ పరిధిలోకి రాదని ఫ్యామిలీ కోర్టుకు తీసుకెళ్లాలని కోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో.. ఆమెను తీసుకొని ఎల్బీనగర్ ఫ్యామిలీ కోర్టుకు తీసుకెళ్లారు. ఈ కేసును పరిశీలించిన న్యాయమూర్తి.. ఈ కేసు విషయంలో తాము ఏమీ చేయలేమని రాజేంద్రనగర్ కోర్టుకే తీసుకెళ్లాలని ఆదేశించారు. దీంతో.. పోలీసులు ఆ చిన్నారిని రాజేంద్రనగర్ కోర్టుకు తీసుకెళ్లారు.
ఏడేళ్ల చిన్నారి తనకేమాత్రం సంబంధం లేని విషయంలో ఇరుక్కొని.. తల్లిదండ్రులు ఇద్దరిని మిస్ కావటమే కాదు.. ముక్కుముఖం తెలియని పోలీసుల వెంట.. కోర్టుల చుట్టూ తిరుగుతున్న వైనాన్ని మనసుతో ఆలోచిస్తే ఎంతో ఆవేదనగా అనిపించకమానదు. పోలీసులు సైతం.. ఈ కేసును ఎలా డీల్ చేయాలి? ఆ చిన్నారిని పదే పదే కోర్టుల చుట్టూ తిప్పకుండా ఏం చేయాలన్న అంశం మీద దృష్టి పెట్టి ఉంటే బాగుండేదేమో..? తప్పు ఎవరిదైనా.. కారణం ఏదైనా.. అంతులేని ఆవేదనతో గమ్యం లేని రహదారిలో నడుస్తున్న చిన్నారి సానియా కష్టానికి కన్నీళ్లు పెట్టటం తప్ప ఇంకేం చేయలేమా..?
ఇప్పుడే అందిన సమాచారం ప్రకారం.. రాజేంద్రనగర్ ఉప్పర్ పల్లి కోర్టుకు తీసుకెళ్లిన సానియాను.. కస్తూర్భా ట్రస్ట్ భవన్ లో ఉంచాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను శనివారానికి వాయిదా వేసింది. సానియాను ఎవరికి అప్పజెప్పాలన్న (నానమ్మకా? తల్లి సోదరుడికా?) అంశం తేలే వరకూ ఆమెను కస్తూర్భా ట్రస్ట్ లో ఉంచాలని పేర్కొంది.