Begin typing your search above and press return to search.

అంబానీని ఒక్క రోజులో దాటేశాడు

By:  Tupaki Desk   |   22 March 2017 11:08 AM GMT
అంబానీని ఒక్క రోజులో దాటేశాడు
X
స్టాక్ మార్కెట్ తాజా సంచలనం రాధాకిషన్ దమానీ. ఈయన ఎవరు? పేరు.. కొత్తగా ఉందే? అంత మొనగాడే అయితే.. ఇంతవరకూ ఇతగాడి పేరు ఎందుకు పెద్దగా వినిపించలేదన్న డౌట్ రావొచ్చు. కానీ.. ఆయన పేరు కంటే.. ఆయనకు చెందిన బ్రాండ్ పేరు చెబితే.. మెట్రో నగరాలకు చెందిన వారంతా ఒక్కసారి తెలుసన్నట్లుగా ఫేస్ పెట్టేస్తారు.ఇంతకీ.. రాధాకిషన్ దమానీ ఎవరంటే.. డి-మార్ట్ చైన్ మార్కెట్ స్టోర్లకు యజమాని. చౌక ధరలకు కిరాణా..జనరల్ వస్తువులు అమ్ముతారన్న పేరును సొంతం చేసుకున్నఇతగాడు.. ఈమధ్యనే తన కంపెనీ షేర్లను పబ్లిక్ ఇష్యూకు వచ్చారు. దీంతో.. ఒక్కసారిగామార్కెట్ వర్గాల కంట్లో పడ్డారు.

దీనికి కారణం లేకపోలేదు. డీమార్ట్ పబ్లిక్ ఇష్యూకువచ్చినంతనే మార్కెట్ పిచ్చ పాజిటివ్ గా రియాక్ట్ కావటమే కాదు.. అనూహ్య స్పందన లభించింది అంతేనా.. స్టాక్ మార్కెట్లో నమోదైన తొలిరోజునే.. ‘‘అవెన్యూ సూపర్ మార్ట్స్’’ పేరిట షేర్లు అదరగొట్టేశాయి. ఇష్యూను రూ.299తో మొదలెట్టిన ఈ షేర్ ధర 102.4 శాతం ఎక్కువగా పెరిగి రూ.604.4 వద్ద షేర్ నమోదైంది. ఒకదశలో గరిష్ఠంగా 117.39వాతం పెరిగి రూ.650మార్క్ ను టచ్ చేసింది కూడా.తర్వాత కాస్త తగ్గింది.

ఏమైనా మార్కెట్లో నమోదైన తొలి రోజునే దుమ్ము దులిపిన షేర్ల పుణ్యమా అని ఈ సంస్థ ప్రమోటర్ రాధా కిషన్ దమానీ సంపద విలువ భారీగా పెరిగిపోయింది. సింగిల్ డేలో ఆయన సంపద దిగ్గజాల సరసన చేరిపోవటం గమనార్హం. తాజా పబ్లిక్ ఇష్యూతో దమానీ నికర సంపద ఏకంగా6 బిలియన్ డాలర్లు (సుమారు రూ.40వేల కోట్లు) చేరింది. సంపదను లెక్కగా తీసుకుంటే..సింగిల్ డేలో కార్పొరేట్ దిగ్గజాలు రాహుల్ బజాజ్.. అనిల్ అగర్వాల్.. అనిల్ అంబానీల్లాంటి మొనగాళ్లను దాటేవారు. ట్రేడింగ్ మొదలయ్యే సరికి..ముగిసే సరికి.. దమానీ విలువ ఒక్కరోజులో ఎంతగా పెరిగిందో తెలుసా?.. అక్షరాల రూ.32వేల కోట్లు మాత్రమే. మీడియాకుదూరంగా ఉండే ఈ బిజినెస్ టైకూన్ స్టాక్ మార్కెట్ ఎంట్రీనే ఇంతగా అదరగొడితే.. రానున్న రోజుల్లో మరెన్ని సంచలనాలు సృష్టిస్తారన్నది ఆసక్తికరంగా మారిందని చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/