Begin typing your search above and press return to search.

పారాహుషార్.. నాలుగో వేవ్ లెక్క చెప్పేసిన కర్ణాటక పెద్దమనిషి

By:  Tupaki Desk   |   8 Jun 2022 4:19 AM GMT
పారాహుషార్.. నాలుగో వేవ్ లెక్క చెప్పేసిన కర్ణాటక పెద్దమనిషి
X
ఏ మాత్రం అవగాహన లేని వేళలో ఒక్కసారిగా వచ్చి పడిన కరోనా మహమ్మారి దెబ్బకు ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చూస్తుండగానే ఒకటి.. రెండు.. మూడు వేవ్ లను దాటేయటం.. జీవితంలో మర్చిపోలేని అనుభవాల్ని మిగిల్చింది మహమ్మారి.

మూడో వేవ్ ముగియటంతో.. కరోనా భయం దాదాపుగా తొలగిపోయినట్లుగా భావించారు. అయితే.. అలాంటిదేమీ లేదని.. కరోనా ప్రమాదం ఇంకా పోలేదన్న విషయాన్ని తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. గడిచిన వారం.. పది రోజులుగా దేశంలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరిగిపోవటం తెలిసిందే.

అయితే.. ఇవేమీ కఠిన చర్యలు తీసుకునేంతగా లేనప్పటికీ.. రానున్న రోజుల్లో ముప్పు ఎంతమేర ఉంటుందన్న విషయంపై మాత్రం భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఇలాంటివేళ.. అందరూ ఉలిక్కిపడే మాటను చెప్పుకొచ్చారు కర్ణాటక వైద్య ఆరోగ్య కమిషనర్ డి. రణదీప్. కర్ణాటక.. మహారాష్ట్రాలలో పెరుగుతున్న కేసుల నేపథ్యంలో కొవిడ్ నాలుగో వేవ్ ఉందన్న సంకేతాన్ని ఆయన ఇస్తున్నాయి. అయితే.. మొదటి మూడింటితో పోలిస్తే.. నాలుగో ప్రభావం పెద్దగా ఉండదన్నారు.

అయితే.. థర్డ్ వేవ్ మాదిరి కొద్దిపాటి లక్షణాలు ఉండటమో.. లేదంటే పూర్తిగా లేకపోని పరిస్థితి ఉండొచ్చన్న మాట వినిపిస్తోంది. అయితే.. ముందు జాగ్రత్తలు.. మాస్కుల వాడకాన్ని మళ్లీ ముమ్మరంగా మొదలు పెట్టాలన్న విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పేశారు.

నాలుగో వేవ్ దగ్గరకు వచ్చేసిందని.. మహా అయితే మరో నాలుగైదు వారాల్లో తన ప్రభావాన్ని చూపిస్తుందన్న మాట ఆయన నోటి నుంచి వచ్చింది. సో.. నాలుగో వేవ్ ఉండదన్న అంచనాల్ని తప్పుగా తేల్చేస్తూ.. తాజాగా చేసిన ప్రకటన నేపథ్యంలో అందరూ మరోసారి అప్రమత్తంగా ఉండాల్సిన సమయం వచ్చేసిందని చెప్పక తప్పదు.