Begin typing your search above and press return to search.

డీఎస్ స‌హా ఆ నేత‌లంతా కాంగ్రెస్‌ లోకి

By:  Tupaki Desk   |   27 Oct 2018 5:48 AM GMT
డీఎస్ స‌హా ఆ నేత‌లంతా కాంగ్రెస్‌ లోకి
X
తెలంగాణ అప‌ద్ధ‌ర్మ స‌ర్కారుకు సార‌థ్యం వ‌హిస్తున్న టీఆర్ ఎస్ పార్టీకి ఊహించ‌ని షాక్ త‌గ‌డం ఖరారు అయింది. ఏకంగా ముగ్గురు నేతలు ఒకేసారి ఆ పార్టీకి షాకివ్వ‌డంతో పాటుగా - కాంగ్రెస్ అధ్యక్షుడి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నారు. కాంగ్రెస్‌ లో చేరుతున్న నేత‌ల్లో టీఆర్ ఎస్‌ కు చెందిన ఎంపీ - ఎమ్మెల్సీ - కీల‌క‌మైన కార్పొరేష‌న్ సంస్థ‌కు ఒక్క‌రోజు ముందే బై చెప్పిన నాయ‌కుడు ఉండ‌టం రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు దారితీస్తోంది. రాజ్య‌స‌భ స‌భ్యుడైన సీనియర్ నేత డీ శ్రీనివాస్ - టీఆర్ ఎస్ వ్య‌వ‌స్థాప‌క స‌భ్యుడు అయిన ఎమ్మెల్సీ రాములు నాయక్ - మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి గులాబీ పార్టీకి గుడ్‌ బై చెప్పి కాంగ్రెస్‌ లో చేర‌నున్నారు. ఇక బీసీనేత ఆర్ కృష్ణయ్య కూడా మూడు రంగుల కండువా క‌ప్పుకోనున్నార‌ని స‌మాచారం.

ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన డీఎస్ తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. జాతీయ స్థాయిలో డీఎస్‌కు ఉన్న పరిచయాల దృష్ట్యా టీఆర్ ఎస్ నాయకత్వం ఆయనను రాజ్యసభకు పంపింది. అయితే అనంత‌రం ప‌రిణామాలు మారాయి. నిజామాబాద్ రాజకీయాల్లో పార్టీ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆ జిల్లా టీఆర్ ఎస్ నేతలు కేసీఆర్‌ కు ఫిర్యాదు చేశారు. ఓ వైపు ఈ ఫిర్యాదు మ‌రోవైపు, నిజామాబాద్ జిల్లాలో త‌న‌ కూతురు కవిత కీలకంగా వ్యవహరిస్తుండ‌గా.. నిజామాబాద్ రాజకీయాల్లో డీఎస్ జోక్యం పెరిగిందని భావించిన కేసీఆర్... ఆయనను పార్టీ వ్యవహారాలకు దూరంగా పెట్టారనే టాక్ కూడా ఉంది. దీంతో కేసీఆర్ తీరుపై అసహనంతో ఉన్న డీఎస్... కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ మేర‌కు ఆయ‌న కాంగ్రెస్ పెద్ద‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రిపి నేడు కండువా కప్పుకోనున్నారు. కాగా, డీఎస్ రాకతో కాంగ్రెస్ బలం కొంత వరకు పెరుగుతుంద‌ని అని అంచనా వేస్తున్నారు.

మ‌రోవైపు టీఆర్ ఎస్ వ్య‌వ‌స్థాప‌క స‌భ్యుడు అయిన ఎమ్మెల్సీ రాములు నాయక్ నారాయ‌ణ‌ఖేడ్ టికెట్‌ ను ఆశించారు. అయితే, ఆయ‌న‌కు నో చెప్ప‌డంతో పాటుగా స‌స్పెండ్ చేయ‌డంతో తిరుగుబాటు జెండా ఎగుర‌వేసి గ‌త కొంత‌కాలంగా కేసీఆర్‌పై నిప్పులు చెరుగుతున్నారు. తాజాగా ఆయ‌న సైతం కాంగ్రెస్‌ లో చేరేందుకు సిద్ధ‌మ‌య్యారు. గ‌త ఎన్నిక‌ల్లో కేసీఆర్ చేతిలో ఓడిపోయి కొద్దికాలానికి టీఆర్ ఎస్‌ లో చేరిన మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి సైతం తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. వీరితో పాటు మరికొందరు కీలక నేతలు కాంగ్రెస్ లో చేరతారనే ప్రచారం సాగుతోంది.