Begin typing your search above and press return to search.
డీఎస్ ను కేసీఆర్ క్షమించినట్లే!
By: Tupaki Desk | 24 Aug 2018 2:21 PM GMTసీనియర్ రాజకీయ వేత్త - రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ ను తెలంగాణ సీఎం కేసీఆర్ క్షమించేశారా? పార్టీలో నెలకొన్న కలకలానికి చెక్ పెట్టేందుకు కేసీఆరే పెద్ద మనసుతో వ్యవహరించారా? రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ తాజాగా పార్టీ ముఖ్యసమావేశంలో కనిపించడంపై ఇదే చర్చ జరుగుతోంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్ లో టీఆర్ ఎస్ ఎల్పీ సమావేశం ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర కమిటీ - శాసనసభాపక్షం - పార్లమెంటరీ పార్టీ సంయుక్త సమావేశం ఏర్పాటుచేసిన కేసీఆర్ సెప్టెంబర్ 2న జరిగే ప్రగతి నివేదన సభ నిర్వహణ - ప్రభుత్వ పథకాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఇంకా.. ప్రగతి నివేదన సభ విజయవంతం కావడానికి కమిటీల ఏర్పాటు - బాధ్యతలు అప్పగించడం, తాజా రాజకీయ పరిణామాలపైన సమావేశం జరగనుంది.
ఈ భేటీకి డీఎస్ హాజరవడం ఆసక్తికరంగా మారింది. డీఎస్ రాజకీయంగా సంకట స్థితిలో ఉన్న సంగతి తెలిసిందే. నర్సింగ్ విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఫిర్యాదు నేపథ్యంలో ఆయన తనయుడు నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ ను జ్యుడీషియల్ కస్టడీలోకి తీసుకున్నారు. దీనిపై డి.శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా జడ్జి తిరస్కరించారు. ఈ మేరకు నిజామాబాద్ ఎస్సీ ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం జడ్జి రమేష్ కుమార్ బెయిల్ పిటిషన్ ను తిరస్కరిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో డీఎస్ లో నెలకొన్న భరోసా సడలిపోయింది. మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో ఆయన పార్టీ సమావేశంలో పాల్గొన్నట్లు తెలుస్తోంది.
టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ - శాసనసభాపక్షం - పార్లమెంటరీ పార్టీ సంయుక్త సమావేశానికి డీఎస్ కు ఆహ్వానం ఉందా అనే విషయంలో టీఆర్ ఎస్ వర్గాలు స్పష్టమైన సమాధానం ఇవ్వడంలేదు. ఆహ్వానం అందకపోయినప్పటికీ డీఎస్ హాజరయ్యారని అంటున్నవారు. వివాదాన్ని మరింత ముదిరిపోయేలా చేసుకోవడం ఇష్టంలేకనే, పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్లే డీఎస్ ఈ భేటీకి వచ్చినట్లు పలువురు పేర్కొంటున్నారు.