Begin typing your search above and press return to search.

ఆ సీనియ‌ర్ నేత కాంగ్రెస్ లో చేర‌డం లేదట‌!

By:  Tupaki Desk   |   5 Sep 2018 4:43 PM GMT
ఆ సీనియ‌ర్ నేత కాంగ్రెస్ లో చేర‌డం లేదట‌!
X
టీఆర్ ఎస్ కు సీనియ‌ర్ పొలిటిషియ‌న్ డీఎస్ గుడ్ బై చెప్ప‌బోతున్నార‌ని, డీఎస్...కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధ‌మైందని వ‌దంతులు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. దానికి తోడు సీఎం కేసీఆర్ కు డీఎస్ లేఖ రాయ‌డం కూడా సంచ‌ల‌నం రేపింది. టీఆర్ ఎస్ త‌న‌పై కక్ష కట్టిందని - తాను ఎటువంటి తప్పు చేయకున్నా సస్పెండ్ చేయాలని కేసీఆర్ కు తీర్మానం పంపార‌ని డీఎస్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తాను టీఆర్ఎస్‌లో ఉండటం ఎంపీ కవితకు - జిల్లా నేతలకు ఇష్టం లేకపోతే సస్పెండ్ చేయాల‌ని కోరారు. ఈ క్ర‌మంలోనే డీఎస్...టీఆర్ ఎస్ కు బై చెప్పి కాంగ్రెస్ లో చేర‌బోతున్నార‌ని పుకార్లు వ‌స్తున్నాయి. ఆయనతో పాటుగా ఎమ్మెల్సీ భూపతిరెడ్డి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ క్ర‌మంలోనే, తాజాగా ఆ వార్త‌ల‌ను డీఎస్ ఖండించారు. ఈ నెల 11న తాను కాంగ్రెస్‌ లో చేర‌బోతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని తేల్చి చెప్పారు.

ఈ నెల 11న సోనియా - రాహుల్‌ గాంధీ సమక్షంలో తాను కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నట్లు జ‌రుగుతోన్న ప్రచారంలో వాస్త‌వం లేదని డీఎస్ అన్నారు. టీఆర్ ఎస్ నేత బాజిరెడ్డి గోవర్దన్‌ వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నానని చెప్పారు. తాను రాసిన లేఖ‌కు సీఎం కేసీఆర్ నుంచి సందేశం రాలేదని డీఎస్ వెల్లడించారు. డీఎస్ కాంగ్రెస్ లో చేర‌డం ఖాయ‌మ‌ని ప్రచారం జ‌రుగుతోన్న స‌మ‌యంలో ఈ వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి. అంత‌కుముందు, డీఎస్ పై బాజిరెడ్డి గోవర్దన్‌ తీవ్ర స్థాయిలో మండిపడిన విషయం తెలిసిందే. పార్టీలో డీఎస్‌ కు సముచితస్థానం ఇచ్చినా....పదవుల కోసం కాంగ్రెస్‌ నేతలతో మంతనాలు జరిపారని ఆరోపించారు. ఎంపీ కవితపై త‌న‌ తనయుడు అరవింద్‌ ఆరోపణలను డీఎస్ ఎందుకు ఖండించలేదని ఆయన ప్రశ్నించారు.