Begin typing your search above and press return to search.
కారు ఎక్కే ఆ నేత డీఎస్సా..!
By: Tupaki Desk | 30 Jun 2015 8:16 AM GMTమరికొద్ది రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి.. తెలంగాణ అధికారపక్షమైన టీఆర్‌ఎస్ పార్టీ భారీ షాక్ ఇవ్వనున్నట్లుగా జరుగుతున్న ప్రచారం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక అత్యున్నత నేత హస్తాన్ని వదిలేసి.. కారు ఎక్కేస్తారని.. ఈ పరిణామంతో కాంగ్రెస్ కుదేలు కావటం ఖాయమన్న ప్రచారం సాగుతోంది.
ఇంతకీ ఆ కాంగ్రెస్ పెద్ద ఎవరన్న సస్పెన్స్ సాగుతోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఆ నేత మరెవరో కాదని.. కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడిగా ఉంటూ.. ఎన్నో ఉన్నతపదవులు చేపట్టిన డి. శ్రీనివాస్‌గా చెబుతున్నారు. పార్టీ నుంచి వెళ్లిపోయేది డీఎస్సే అని చెప్పటానికి బలమైన కారణాలు కూడా చూపిస్తున్నారు.
ఈ మధ్య హైదరాబాద్‌కు వచ్చిన పార్టీ కీలక నేత దిగ్విజయ్ సింగ్.. డీఎస్‌ను కలిసే ప్రయత్నం చేశారని.. అయితే.. అందుకు డీఎస్ ససేమిరా అన్నారని చెబుతున్నారు. పార్టీ మారుతున్న నేపథ్యంలోనే డీఎస్.. డిగ్గీరాజాను కలుసుకునేందుకు ఇష్టపడలేదని చెబుతున్నారు.
విభజన తర్వాత తనను పార్టీ అవమానించిందని.. పెద్దగా పట్టించుకోవటం లేదన్న వేదనతో ఉన్న డీఎస్.. టీఆర్‌ఎస్ అధినేత స్వయంగా కోరిన మీదట.. ఆయన పార్టీ మారేందుకు సిద్ధం అయ్యారని చెబుతున్నారు. ఈ కారణంగానే.. గత రెండు రోజులుగా కాంగ్రెస్ పార్టీ నేతలు తెలంగాణ అధికారపక్షంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారని చెబుతున్నారు. మరి.. ఈ వార్తలపై డీఎస్ ఎలా స్పందిస్తారో చూడాలి.