Begin typing your search above and press return to search.
రాహుల్ ను కలిశా..కాంగ్రెస్ లో చేరలేదన్న డీఎస్
By: Tupaki Desk | 27 Oct 2018 9:50 AM GMTఇవాల్టి పత్రికల్ని చూస్తే..ఒకప్పుడు కాంగ్రెస్ లో ఒక వెలుగు వెలిగి.. తర్వాతి కాలంలో టీఆర్ ఎస్ లో చేరిన డి. శ్రీనివాస్ ఈ రోజు కాంగ్రెస్ లో చేరుతున్నట్లుగా కొన్ని వార్తలు వచ్చాయి. ఇలా వచ్చిన వార్తలు చిన్న చితకా మీడియా సంస్థల్లో కాక.. పెద్ద పెద్ద మీడియా సంస్థల్లో వచ్చాయి. డీఎస్ తో పాటు మరికొందరు కీలక నేతలు రాహుల్ సమక్షంలో పార్టీలో చేరతారని.. ఈ చేరికలు అధికార టీఆర్ ఎస్ కు షాకింగ్ గా మారతాయన్న మాట వినిపించింది.
ఇదిలా ఉంటే.. తాను కాంగ్రెస్ లో చేరినట్లుగా వస్తున్న వార్తలపై డీఎస్ రియాక్ట్ అయ్యారు. తాను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసిన విషయం మాత్రం నిజమని.. అంత మాత్రాన పార్టీలో చేరినట్లు కాదని క్లారిటీ ఇచ్చారు. తనకు రాహుల్ సమయం ఇచ్చారని.. దీంతో ఆయన్ను కలిశానన్నారు.
తాను రాహుల్ తో ఏం మాట్లాడానన్న విషయాన్ని మీడియాకు చెప్పాల్సిన అవసరం లేదన్న డి. శ్రీనివాస్..గతంలోనూ తాను చాలా సందర్భాల్లో చాలామందిని కలిసిన వైనాన్ని గుర్తు చేశారు. ఇప్పుడే కాదు.. ఇంకెప్పుడూ కలుస్తునే ఉంటానని చెప్పారు. కాంగ్రెస్‌లో చేరిన వార్తలపై స్పందిస్తూ.. తాను కాంగ్రెస్ లో చేరిన విషయాన్ని మీడియాకు ఎప్పుడు చెప్పానంటూ ప్రశ్నించారు.
డీఎస్ తో పాటు గజ్వేల్ నియోజకవర్గంలో పేరున్న టీఆర్ ఎస్ నేత టి. నర్సారెడ్డి.. ఎమ్మెల్సీ రాములు నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు డీఎస్.. ఆర్ కృష్ణయ్యలు కూడా పార్టీలో చేరతారని చెప్పినా.. అవేమీ వాస్తవ రూపం దాల్చకపోవటం గమనార్హం. టీఆర్ ఎస్ అధినేతకు దశల వారీగా షాకులు ఇచ్చేందుకు డీఎస్ ను రిజర్వ్ లో ఉంచారా? అన్నది ఇప్పుడు సందేహంగా మారింది.