Begin typing your search above and press return to search.
వైఎస్ జోడెద్దు కాంగ్రెస్ ను వీడింది..
By: Tupaki Desk | 1 July 2015 8:12 AM GMT కాంగ్రెస్ సీనియర్ నేత.. ఉమ్మడి రాష్ట్ర మాజీ పీసీసీ చీఫ్ డి. శ్రీనివాస్ కాంగ్రెస్ తో తన సుదీర్ఘ అనుబంధానికి తెర దించారు. ఆయన కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ వెంటనే ఆయన హైద్రాబాద్‌లోని సీఎం కేసీఆర్ క్యాంపు ఆఫీసులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమయ్యారు. దీంతో ఆయన టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధమైనట్లు స్పష్టమైంది. 6వ తేదీన ఆయన టీఆరెస్ లో చేరుతారని సమాచారం. మరోవైపు డీఎస్‌ను కలిసేందుకు కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, నేతలు భట్టి విక్రమార్క, వి. హన్మంతారావులు ఆయన నివాసానికి వెళ్లారు. అక్కడ డీఎస్ లేకపోవడం.. అప్పటికే ఆయన రాజీనామా చేసినట్లు సమాచారం అందడంతో వారంతా వెనుదిరిగారు.
ఇటీవల కొద్దికాలంగా కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలపై డీఎస్ బాగా అసంతృప్తిగా ఉన్నారు.. దీనిపై ఆయన ఇప్పటికే సోనియాగాంధీకి లేఖ కూడా రాశారు. అప్పటి నుంచే ఆయన గులాబీ కండువా కప్పుకొంటారన్న ప్రచారం తీవ్రమైంది. అంతలోనే పీవీ వర్ధంతి సభలో పాల్గొనేందుకు వచ్చిన దిగ్విజయ్ సింగ్ కబురుచేసినా డీఎస్ అయన్ను కలవలేదు. దీంతో ఆయన పార్టీని వీడడం ఖాయమని ఆ పార్టీ నేతలు డిసైడైపోయారు. అనుకున్నట్లుగానే ఆయన కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేశారు. జులై 6న ఆయన అధికారికంగా టీఆరెస్ లో చేరుతారని.. ఆయనకు కీలక పదవి దక్కుతుందని భావిస్తున్నారు.
కాగా 2004, 2009లో పీసీసీ సారథిగా ఉన్న డీఎస్ ఆ రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి బాటలు వేశారు... వైఎస్ రాజశేఖరరెడ్డితో కలిసి జోడెద్దులుగా పేరొంది వారు కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చారు.