Begin typing your search above and press return to search.
టీఆర్ఎస్ నాయినికి ప్రాధాన్యత ఇవ్వలేదు: డీఎస్
By: Tupaki Desk | 2 Nov 2020 4:30 PM GMTసీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ డి. శ్రీనివాస్ మరోసారి టీఆర్ఎస్ పై మండిపడ్డారు. ఆ పార్టీ నుంచే రాజ్యసభకు వెళ్లి తిరుగుబాటు చేస్తున్న ఆయన తాజాగా నాయిని కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ టీఆర్ఎస్ తీరుపై విమర్శలు గుప్పించారు.
టీఆర్ఎస్ పార్టీలో మాజీ మంత్రి నాయిని నరసింహారెడ్డికి అన్యాయం జరిగిందని ఆ పార్టీ నేత డీ. శ్రీనివాస్ ఆరోపించారు. తెలంగాణ కోసం నాయిని ఎంతో కృషి చేశారని కొనియాడారు. టీఆర్ఎస్ పార్టీ నాయినికి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని అన్నారు. కనీసం పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిందని డీఎస్ ఆరోపించారు.
చివరి దశలో నాయిని మానసిక క్షోభ అనుభవించారని డీఎస్ అన్నారు. నాయినిని టీఆర్ఎస్ పక్కన పెట్టిందన్నారు. ఇప్పటికే నాయిని, ఆయన భార్య వారం వ్యవధిలో చనిపోయినందున వారి కుటుంబానికైనా టీఆర్ఎస్ నాయకత్వం న్యాయం చేయాలని డీఎస్ కోరారు. విద్యార్తి దశ నుంచే తనకు నాయి మంచి స్నేహితుడని ఈ సందర్భంగా డీఎస్ గుర్తు చేసుకున్నారు.