Begin typing your search above and press return to search.
అవినీతిలో చంద్రబాబు - లోకేష్ పాత్ర: దాడి వీరభద్రరావు తీవ్ర విమర్శలు
By: Tupaki Desk | 14 Jun 2020 8:30 AM GMTఅవినీతిని నిర్మూలించేందుకు సీఎం జగన్ కృషి చేస్తున్నాడని.. అవినీతిపై యుద్ధం ప్రకటించి అక్రమార్కుల భరతం పడుతుంటే చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారంటూ వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు పేర్కొన్నారు. అచ్చెన్నాయుడు - జేసీ కుటుంబసభ్యులు - చింతమనేని ప్రభాకర్ అరెస్టులపై చంద్రబాబు చేస్తున్న ఆరోపణలు.. విమర్శలపై దాడి వీరభద్రరావు తిప్పి కొట్టారు. ఈ సందర్భంగా ఆదివారం విశాఖపట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేశ్ ఐదేళ్లూ రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు. వారి హయంలో జరిగిన ప్రతి దోపిడీ వెనుక వీరిద్దరి హస్తం ఉందని పేర్కొన్నారు. తమ అవినీతి బయటపడుతుండడంతో చంద్రబాబు ఉలిక్కిపడుతున్నారని తెలిపారు. తప్పుడు ఆరోపణలతో విషయాన్ని పక్కదారి పట్టించాలని చూస్తున్నారని చెప్పారు. అచ్చెన్నాయుడిని ఈఎస్ఐ కుంభకోణంలో అరెస్ట్ చేస్తే బీసీ కార్డు వాడడం.. జేసీ ప్రభాకరరెడ్డి అరెస్టయితే కక్ష సాధింపు అని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఖండించారు. సీఎం జగన్ గేట్లు ఎత్తితే టీడీపీ ఎమ్మెల్యేలు మొత్తం వైఎస్సార్‌సీపీలో చేరేవారని.. కానీ జగన్ విలువలు కలిగిన వ్యక్తి కాబట్టే వ్యక్తి అని అందుకే ఫిరాయింపులు ప్రోత్సహించలేదని వివరించారు.
జగన్ ఏడాది పాలనలో అవినీతికి ఆస్కారం లేకుండా చేశారని దాడి తెలిపారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎపుడైనా అవినీతి నిర్మూలనపై చర్యలు తీసుకున్నారా అని ప్రశ్నించారు. అవినీతిపరులకి టీడీపీ అండగా ఉంటోందని మండిపడ్డారు. ఎన్నికల ముందు పోలవరంలో అవినీతి జరిగిందని ప్రధానిమోదీ చంద్రబాబుపై ఆరోపణలు చేశారు. పోలవరంపై ప్రధాని మోదీ విచారణ చేసి ఉంటే ఈ రోజు చంద్రబాబు ఎన్నికలలో పోటీచేసే అవకాశమే ఉండేది కాదని పేర్కొన్నారు. ఈఎస్ఐ కుంభకోణంలో లోకేష్ పాత్ర, మిగిలిన వారి పాత్ర ఎంత ఉందో వెలికి తీయాలని డిమాండ్ చేశారు. ఈఎస్ఐ కుంభకోణంలో మంత్రి ప్రమేయం లేనప్పుడు ఆయన ఎందుకు సిఫార్సు లేఖలు ఇచ్చారు. అచ్చెన్నాయుడు అరెస్ట్‌పై చంద్రబాబు, లోకేష్ అతిగా బాధపడటం చూస్తుంటే వీరి పాత్రపై అనుమానాలు కలుగుతున్నాయని ఎద్దేవా చేశారు.
అచ్చెన్నాయుడిపై చూపిన ప్రేమ మీరు కోడెలపై ఎందుకు చూపలేదు.. కోడెలపై కక్ష సాధింపు చేపట్టారా అని వీరభద్రరావు ప్రశ్నించారు. అచ్చెంన్నాయుడు బీసీలకి నేత కాదు.. ఎన్టీఆర్ బతికున్నప్పుడు మాత్రమే టీడీపీ బీసీల పార్టీగా ఉందని.. ఇప్పుడున్న టీడీపీ మనీ పార్టీ. దోచుకో.. దాచుకో..ఎన్నికల సమయంలో ఖర్చుపెట్టుకో ఇదే నినాదమని వ్యంగంగా తెలిపారు. . . తాను అధికారంలో ఉన్నప్పుడు చట్టం తనపని తాను చేసుకుపోతుంది అన్న బాబు ఇప్పుడు ఎందుకు ఆ మాట చెప్పలేకపోతున్నారు అని దాడి వీరభద్రరావు ప్రశ్నించారు.