Begin typing your search above and press return to search.
వైఎస్సార్సీపీ నుంచి దగ్గుబాటి ఔట్?
By: Tupaki Desk | 11 Oct 2019 2:30 PM GMTఎన్నికల ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిన సీనియర్ పొలిటీషియన్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆ పార్టీని వీడనున్నారా? తనయుడి రాజకీయ భవితవ్యం కోసమని వైఎస్సార్ కాంగ్రెస్ లోకి చేరారు దగ్గుబాటి. అయితే ఆయన తనయుడు ఎన్నికల్లో పోటీ చేయలేకపోయాడు. అమెరికా పౌరసత్వ వ్యవహారంతో ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేకపోయినట్టుగా తెలుస్తోంది. దీంతో చేసేది లేక స్వయంగా దగ్గుబాటే ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అయితే ఆయన ఓడిపోయారు.
రాష్ట్రమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగా ఊపు మీద ఉన్నా, దాదాపుగా స్వీప్ చేసినా.. వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన దగ్గుబాటి మాత్రం ఓటమి పాలయ్యారు. దానికి నియోజకవర్గంలో పరిస్థితులే కారణమని తెలుస్తోంది. ఆఖర్లో వైసీపీ లోకి చేరిన దగ్గుబాటికి పార్టీ క్యాడర్ పెద్దగా సహకరించనట్టుగా తెలుస్తోంది. కొందరు అప్పుడు పార్టీని వీడారు కూడా. ఎన్నికల్లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఓడినా పార్టీ అధికారంలోకి వచ్చింది.
ఈ నేపథ్యంలో అప్పుడు పార్టీని వీడిన కొంతమంది ఇప్పుడు తిరిగి చేరుతూ ఉన్నారు. తను ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు విజయానికి సహకరించక పార్టీని వీడిన వారు ఇప్పుడు తిరిగి రావడం పట్ల దగ్గుబాటి కినుక వహించినట్టుగా తెలుస్తోంది. అది కూడా తనకు మాట మాత్రమైన చెప్పకుండా వారిని పార్టీ చేర్చుకుంటోందని దగ్గుబాటి మరింత అసహనంతో ఉన్నారట. తనను పట్టించుకోవడం లేదని ఆయన భావిస్తున్నారని తెలుస్తోంది.
ఇక దగ్గుబాటి భార్య, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో ఉన్న సంగతి తెలిసిందే. ఆమె బీజేపీ తరఫున యాక్టివ్ పొలిటీషియన్ గా ఉన్నారు. వివిధ అంశాల గురించి జగన్ ప్రభుత్వాన్ని ఆమె విమర్శిస్తూ ఉన్నారు. విధానపరంగా ఆమె బీజేపీ టోన్ కు అనుకూలంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలోఇది కూడా దగ్గుబాటికి ఇబ్బందిగా మారిందట.
పురందేశ్వరి బీజేపీలోకి చేరాకా.. చాన్నాళ్ల పాటు దగ్గుబాటి రాజకీయంగా మౌనంగా ఉంటూ వచ్చారు. అయితే ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. ఇప్పుడు ఆమె వైసీపీ రాజకీయ విమర్శలు చేస్తూ ఉండటం, తను ఆ పార్టీలో ఉండటం కూడా అంత బావుండదనే లెక్కలతో దగ్గుబాటి ఉన్నారట.
ఈ నేపథ్యంలో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడటం దాదాపు ఖరారు అయినట్టుగా తెలుస్తోంది. పార్టీలో తనను పట్టించుకోలేదన్న భావన - మరోవైపు భార్య రాజకీయం కోసం ఆయన వైదొలుగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.