Begin typing your search above and press return to search.

పురంధేశ్వ‌రి రాజ‌కీయ వార‌సుడు వ‌స్తున్నాడా?

By:  Tupaki Desk   |   13 July 2018 10:38 AM GMT
పురంధేశ్వ‌రి రాజ‌కీయ వార‌సుడు వ‌స్తున్నాడా?
X
ఎన్టీఆర్ కుటుంబం సినిమాల్లోనే కాదు - ఇటు రాజ‌కీయాల్లోనే త‌న వార‌స‌త్వాన్ని కొన‌సాగిస్తోంది. కొత్త త‌రం రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించ‌డానికి ఆస‌క్తి ప్ర‌ద‌ర్శిస్తోంది. ఎన్టీఆర్ త‌ర్వాత ఎన్టీఆర్ వార‌సుల్లో రాజ‌కీయంగా బాగా దేశంలో పేరు పొందిన వ్య‌క్తి పురంధేశ్వ‌రి. చంద్ర‌బాబుది నారా కుటుంబం కాబ‌ట్టి - నంద‌మూరి వంశంలో ఎన్టీఆర్ త‌ర్వాత పాపుల‌ర్ పొలిటిక‌ల్ లీడ‌ర్ గా పురంధేశ్వ‌రినే చెప్పుకోవాలి. బాల‌కృష్ణ ఉన్నాఆమె పాపులారిటీ రాజ‌కీయాల్లో బాల‌కృష్ణ‌కు లేదు. మిగ‌తావాళ్లంతా దిగ‌దుడుపే.

ఇటీవ‌లే లోకేష్ రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించిన విష‌యం తెలిసిందే. మంత్రిగా కూడా కొన‌సాగుతున్నారు. లోకేష్‌ తో స‌న్నిహితంగా ఉండే హితేష్ చెంచురామ్ ఇపుడు నంద‌మూరి వార‌సత్వంతో రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నారు. అయితే, మ‌రి పురంధేశ్వ‌రి ఇపుడు ఏపీలో బ‌లం లేని బీజేపీలో ఉంది. అలాంట‌పుడు హితేష్‌కు ఇపుడు ఏ పార్టీలో చేరాల‌న్న‌ది పెద్ద స‌మ‌స్య‌గా ఉంది. అయితే, ఎంత కొట్టుకున్నా కుటుంబ బంధాలు ఎక్క‌డో చోట క‌లుస్తాయి క‌దా. అందుకే రాజ‌కీయంగా త‌మ విష‌యాలు ప‌క్క‌న పెట్టి ఆ నిర్ణ‌యాన్ని కొడుకు హితేష్‌ కే వ‌దిలేయాల‌ని పురంధేశ్వ‌రి దంప‌తులు నిర్ణ‌యించుకున్నారట‌. త‌ల్లిదండ్రులు ఇద్ద‌రూ ఒక‌ప్పుడు చాలా కీల‌క పాత్ర‌లు పోషించినా... బీజేపీతో రాజ‌కీయ అరంగేట్రం త‌మ కొడుక్కి అంత మంచిది కాద‌ని వారు భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో అటు టీడీపీతో గాని - ఇటు వైసీపీతో గాని ఏదీ వారికి రాజ‌కీయ సంబంధాలున్నా పార్టీలు కానందున ఆ నిర్ణ‌యాన్ని కొడుకుకే వ‌దిలేయాల‌ని ఆలోచిస్తున్నార‌ట‌.

ఈ నేప‌థ్యంలో లోకేష్‌ తో మంచి సంబంధాలు నెర‌పుతున్న హితేష్ తెలుగుదేశం అయితే అన్నిర‌కాలుగా బావుంటుంద‌ని అనుకుంటున్న‌ట్లు స‌మాచారం. అక్క‌డుంటే నంద‌మూరి వార‌స‌త్వాన్ని వాడుకునే అవ‌కాశం ఉంటుంది. ఆ ఓట్లు ఎలాగూ క‌లిసొస్తాయి. గుంటూరు - కృష్ణాలో కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో వారికి మంచి మ‌ద్ద‌తు ఉండ‌టంతో ఆ రెండు జిల్లాల్లో ఎక్క‌డో ఒక చోటు నుంచి 2019 లో హితేష్ రాజ‌కీయ అరంగేట్రం జ‌ర‌గొచ్చ‌ని అంటున్నారు. అయితే, ఇవ‌న్నీ అంచ‌నాలే. రేపు ఆయ‌న బీజేపీ నుంచి పోటీ చేసినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌ర‌మేం లేదు. రాజ‌కీయాల్లో ఏదీ శాశ్వ‌తం కాదు క‌దా!.