Begin typing your search above and press return to search.
విశాఖ ఎంపీగా చిన్నమ్మ...?
By: Tupaki Desk | 22 March 2022 2:30 AM GMTఆమె ఎన్టీయార్ తనయ. రాజకీయాల్లో మాత్రం టీడీపీ తప్ప మిగిలిన అన్ని పార్టీలలో ఆమె కనిపిస్తున్నారు. మొదట కాంగ్రెస్ పార్టీలో రాజకీయ అరంగేట్రం చేసిన దగ్గుబాటి పురంధేశ్వరి బాపట్ల నుంచి పోటీ చేసి ఫస్ట్ అటెంప్ట్ లోనే ఎంపీ అయ్యారు. ఇక విశాఖకు 2009లో షిఫ్ట్ అయి కాంగ్రెస్ ఎంపీగా గెలిచారు. ఈ దఫా ఆమె కేంద్రంలో మంత్రిగా కూడా పనిచేశారు. 2019లో బీజేపీ నుంచి విశాఖ నుంచి పోటీ చేస్తే డిపాజిట్లు రాకపోవడం రాజకీయ విషాదం.
ఇవన్నీ పక్కన పెడితే దగ్గుబాటి పురంధేశ్వరి విశాఖ పర్యటనలు ఈ మధ్య బాగా చేస్తున్నారు. ఆమె కుమార్తె కూడా అక్కడే ఉండడం వల్ల ఒక విధంగా ఆమె కూడా విశాఖ వాసిగా చెప్పుకోవాలి. ఇక గతంలో ఎంపీగా మంత్రిగా చేసి ఉండడంతో రాజకీయ సామాజిక పరిచయాలు చాలానే ఉన్నాయి.
అయితే బీజేపీ తరఫున ఏ పొత్తూ లేకుండా ఆమె గత ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల ఓడారు. కానీ ఈసారి మాత్రం పొత్తులు ఉంటే కచ్చితంగా గెలుస్తారు అని అనుచరులు అంటున్నారు. ఏపీలో బీజేపీ, టీడీపీ జనసేన కూటమిగా 2024 ఎన్నికల వేళ వైసీపీని ఢీ కొడతారు అని వార్తలు వస్తున్న నేపధ్యంలో విశాఖ ఎంపీ సీటుకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోతోంది.
ఇప్పటికే ఇక్కడ నుంచి రెండవసారి పోటీ చేయడానికి టీడీపీ యువనేత. బాలయ్య అల్లుడు భరత్ రెడీగా ఉన్నారు. ఇక జనసేన నుంచి కానీ బీజేపీ నుంచి కానీ పోటీకి తాను రెడీ అన్నట్లుగా మాజీ జేడీ లక్ష్మీ నారాయణ సంకేతాలు ఇస్తున్నారు.
బీజేపీ నుంచి దగ్గుబాటి పురంధేశ్వరి పోటీకి సిద్ధమని లేటెస్ట్ టాక్. మూడు పార్టీలు ఒక్కటితే దానికి పురంధేశ్వరి వ్యక్తిగత చరిష్మా కూడా తోడు అయితే గెలుపు ఖాయమని అంటున్నారు. మొత్తానికి విశాఖ ఎంపీ సీటు మీద చిన్నమ్మ కర్చీఫ్ వేసేసారు అన్న ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.