Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ పదవి పోవడానికి కారణం బాలయ్యే
By: Tupaki Desk | 2 Jan 2019 2:24 PM GMTఎన్టీఆర్ బయోపిక్ తో సంక్రాంతికి బరిలోకి వస్తున్నాడు బాలయ్య. రెండు భాగాలుగా తీసిన ఈ సినిమా మొదటి భాగాన్ని వచ్చే వారం రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రని అద్భుతంగా చేసి ఔరా అన్పించుకునేందుకు చాలా కష్టపడ్డారు. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకున్న వేళ.. ఒక పాత వైరల్ వీడియో బాలయ్యకు - కథానాయకుడు టీమ్ కు నిద్రలేకుండా చేస్తోంది. తండ్రి పాత్రలో నటించకుండా జీవించేసిన బాలయ్యే ఎన్టీఆర్ కు ముఖ్యమంత్రి పదవి పోవడానికి కారణం అని దగ్గబాటి వెంకటేశ్వరరావు మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
గతేడాది ఎన్టీఆర్ బయోపిక్ తీయబోతున్నట్లు ప్రకటించాడు బాలయ్య. ఆ సమయంలో.. ఎన్టీఆర్ బయోపిక్ గురించి అందరి అభిప్రాయాలు తీసుకున్న మీడియా.. అదే సమయంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు అభిప్రాయం కూడా తీసుకుంది. ఈ సందర్భంగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ తీస్తాడని తాను అనుకోవడం లేదని అన్నారు. ఎందుకంటే.. అసలు ఎన్టీఆర్ కు పదవి పోవడానికి బాలయ్యే కారణమని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైశ్రాయ్ ఎపిసోడ్ కు ముందు తన దగ్గరకు ముగ్గురు వ్యక్తులు వచ్చారని చెప్పారు. అందులో ఒకరు చంద్రబాబు - రెండు హరికృష్ణ - మూడో వ్యక్తి బాలకృష్ణ అని అన్నారు. పార్టీలో లక్ష్మీపార్వతి డామినేషన్ ఎక్కువైనందువల్ల.. ఎన్టీఆర్ ను పదవి నుంచి దించేద్దాం అని ప్రతిపాదించింది బాలకృష్ణే అని అన్నారు దగ్గుబాటి. చంద్రబాబుకు ముఖ్యమంత్రి పదవి.. బాలకృష్ణకు పార్టీ అధ్యక్ష పదవి - హరికృష్ణ సెక్రటరీ - తనకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తారని వారు ప్లాన్ వేశారని దగ్గుబాటి చెప్పారు. ఆ తర్వాత చంద్రబాబు పథకం ప్రకారం.. హరికృష్ణ - బాలయ్యను డమ్మీలను చేసి అందరిని తరిమేశారని… ఎన్టీఆర్ కు ద్రోహం చేసిన వాళ్లలో తనూ ఒకడినని దగ్గుబాటి వివరించారు. తండ్రి అని కూడా చూడకుండా ఎన్టీఆర్ ఆనాడు అందరూ కలిసి మోసం చేశారని.. ఇప్పుడు వాళ్లంతా కలిసి బయోపిక్ తీస్తే అందులో వాస్తవాలు చూపించే అవకాశాలు తక్కువేనని అభిప్రాయపడ్డారు. ఏడాది క్రితం తీసిన ఈ వీడియో.. ఇప్పుడు కథానాయకుడు రిలీజ్ టైమ్ లో వైరల్ అవ్వడంతో దిద్దుబాటు చర్యలు చేపట్టింది సినిమా టీమ్.