Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ కు 5 వేల ఓట్లు కూడా రావన్న బాబు

By:  Tupaki Desk   |   14 April 2017 11:53 AM GMT
ఎన్టీఆర్ కు 5 వేల ఓట్లు కూడా రావన్న బాబు
X
ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం తీసుకున్న ఆయన కుటుంబసభ్యుల్లో అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు మొట్టమొదటివారు. ఆ తరువాతే మిగతావారంతా చేరారు. చంద్రబాబు - కేసీఆర్ వంవారంతా టీడీపీలో చేరిన క్రమాన్ని ఆయన ఇటీవల వివరించారు.

‘‘ఎన్టీఆర్ టీడీపీని స్థాపించేనాటికి చంద్రబాబు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. 1983 అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది ముందుగా తిరుపతిలో మహానాడు నిర్వహించాలని ఎన్టీఆర్ అనుకున్నారు. ఆ సమయంలో నేను చంద్రబాబు ఇంటికి వెళ్లి టీడీపీలో చేరాలని ఆహ్వానించాను .కానీ, చంద్రబాబు ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. సినీ నటులు రాజకీయాల్లో రాణించలేరని చెప్పారు. ఎన్టీఆర్ కు 5 వేల ఓట్లు కూడా రావని కూడా చంద్రబాబు అన్నారు. అదే రోజు సాయంత్రం ఆయన ఎన్టీఆర్ పై పోటీ చేస్తానని ప్రకటంచారు. అది జరిగిన కొన్నాళ్లకు టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. చంద్రబాబు వచ్చి టీడీపీలో చేరారు. ఆయన చేరికను టీడీపీలో చాలామంది వ్యతిరేకించారు. అలాగే చంద్రబాబు నన్ను అణగదొక్కడానికి చాలా ప్రయత్నించేవారు. నన్ను మంత్రిని చేయాలని ఎన్టీఆర్ అనుకున్న ప్రతిసారీ.. ‘‘అల్లుడికి అందలం’’ అని ఈనాడు పత్రికలో వచ్చేది. దాంతో ఎన్టీఆర్ వ్యతిరేకత వస్తుందన్న భయంతో ఆగిపోయేవారు. ఇలా రెండు మూడుసార్లు జరిగింది. చివరకు ఎన్టీఆర్ ఒకసారి సడెన్ గా నన్ను మంత్రిని చేశారు.’’

‘‘ఇక కేసీఆర్ గురించి చెప్పాలంటే.. ఆయన 1983కి ముందే నన్ను కలిశారు. సిద్ధిపేట యూత్ కాంగ్రెస్ లీడర్ గా పరిచయం చేసుకుంటూ వచ్చారు. టీడీపీలో చేరాలన్న ఆకాంక్షను వ్యక్తంచేశారు. ఎన్టీఆర్ వద్దకు తీసుకెళ్లగా ఆయన టిక్కెట్ ఇవ్వడానికి అంగీకరించారు.’

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/