Begin typing your search above and press return to search.
ఏబీఎన్ రాధాకృష్ణ పై దగ్గుబాటి నిప్పులు
By: Tupaki Desk | 27 Feb 2019 5:24 AM GMTవైసీపీలో చేరేందుకు సిద్ధమైన దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఫ్యామిలీ ఈ మేరకు ఏర్పాట్లు చకచకా చేసుకుంటోంది. దివంగత ఎన్టీఆర్ కు అల్లుడైన దగ్గుబాటికి మరో తోడల్లుడు చంద్రబాబు అంటే అస్సలు పడదు. మామ ఎన్టీఆర్ ను మోసం చేసిన బాబుపై ఆయనపై దుమ్మెత్తిపోస్తుంటారు. అందుకే టీడీపీకి దూరంగా జరిగారు.
తాజాగా దగ్గుబాటి వైసీపీలో చేరేందుకు రెడీ కావడంతో టీడీపీ, ఆయన అనుకూల మీడియా రగిలిపోతోంది. తాజాగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ తన కొత్తపలుకు ఎడిటోరియల్ లో దగ్గుబాటి గురించి హాట్ కామెంట్స్ చేశారు. ‘చంద్రబాబు అధికారం, పార్టీపై కమాండ్ ను చూసి దగ్గుబాటి అసూయతో రగిలిపోతున్నాడు’ అంటూ రాధాకృష్ణ రాసుకొచ్చాడు.
దీనిపై తాజాగా దగ్గుబాటి స్పందించారు. ‘ఏబీఎన్ రాధాకృష్ణ ఎందుకు రగిలిపోతున్నారో అర్థం కావడంలేదని.. బహుశా తాను వైసీపీలో చేరడాన్ని ఆయన జీర్ణించుకోవడం లేదు’ అని మండిపడ్డారు. తాను వైసీపీలో చేరితే రాధాకృష్ణ తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. ‘‘రాధాకృష్ణ ఏపీ ప్రాజెక్టుల్లో కమీషన్లు పొందుతున్నాడు.. ఇప్పుడు వైసీపీ అధికారంలోకి రాబోతోంది. ఇదే జరిగితే ఆయన డబ్బును, కమీషన్ ను పొందలేడు కదా..’ అని దగ్గుబాటి హాట్ కామెంట్ చేశారు. చంద్రబాబు ఓడిపోకుండా రాధాకృష్ణ చేయాల్సిందంతా చేస్తున్నాడని.. సోషల్ మీడియా, మీడియాల్లో వైసీపీపై రాద్ధాంతం ప్రచారం చేస్తున్నాడని అన్నారు. రాధాకృష్ణ, చంద్రబాబులను చూస్తుంటే జాలి వేస్తోందని దగ్గుబాటి ఎద్దేవా చేశారు.
‘చంద్రబాబు సుధీర్ఘ సమీక్ష సమావేశాలను అధికారులు బోరింగ్ గా ఫీలవుతున్నారు. బాబు ఆదేశాలు వ్యవస్థలను బలహీనం చేస్తున్నాయని వాపోతున్నారు. ఇప్పటికే స్పీకర్ పోస్టును బాబు నామమాత్రంగా చేశారు. దమ్ముంటే రాజీనామా చేసి ఇతర పార్టీల నుంచి రావాలని బాబు తీర్మానం చేయగలరా? స్పీకర్ సొంతంగా నిర్ణయం తీసుకొని టీడీపీలో నిలబడగలరా?’ అంటూ దగ్గుబాటి వెంకటేశ్వరరావు చంద్రబాబు, ఆయన పార్టీపై నిప్పులు చెరిగారు.
ఇక తన తోడల్లుడి వైఖరిపై హాట్ కామెంట్స్ చేశారు దగ్గుబాటి.. ‘ప్రకృతిలో నాలుగు వింతలున్నాయని.. ఐదో వింత చంద్రబాబు. ఇప్పుడు భవిష్యత్తులో కూడా ఆయనే వింత. పోలవరాన్ని టీడీపీ జేబులు నింపుకోవడానికే కడుతున్నారు. మైనింగ్ తో టీడీపీ నేతలు కోట్లకు పడగలెత్తారు. అమరావతిలో అభివృద్ధి పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. ’అంటూ బాబు పాలనను దగ్గుబాటి కడిగిపారేశారు.
ఇక తన కుమారుడు హితేష్ చెంచురామ్ వైసీపీలో చేరిక ముహూర్తాన్ని కూడా దగ్గుబాటి బయటపెట్టారు. బుధవారం వైసీపీ అధ్యక్షుడు జగన్ తాడేపల్లిలో నూతన గృహ ప్రవేశం చేస్తారని.. ఆరోజే హితేష్ వైసీపీలో చేరుతున్నారని తెలిపారు. పరచూరు నియోజకవర్గం నుంచి హితేష్ ను వైసీపీ తరుఫున నిలబెడుతున్నట్టు దగ్గుబాటి వివరించారు.