Begin typing your search above and press return to search.
జగన్ కష్టమే అధికారంలోకి తీసుకొస్తుంది
By: Tupaki Desk | 20 Jun 2018 11:33 AM GMTతెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ అల్లుడిగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు అప్పట్లో ఓ వెలుగు వెలిగారు. ఉమ్మడి ఏపీలో మంత్రిగానూ పనిచేశారు. ఆ తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరంగా జరిగారు. ఆయన భార్య దగ్గుబాటి పురందేశ్వరీ ప్రస్తుతం బీజేపీ లో ఉంటూ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నారు.
చంద్రబాబుకు సోదరుడు వరుస అయ్యే వెంకటేశ్వరరావు తాజాగా మాట్లాడిన మాటలు సంచలనమయ్యాయి. ఇప్పటికే దగ్గుబాటి నాటి ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానం.. చివరకు పదవీ చిత్యుడు కావడం తదితర విషయాలపై కొన్ని పుస్తకాలు కూడా రాశాడు.
తాజాగా బుధవారం మీడియా ముందుకు వచ్చి ప్రస్తుత ఏపీ రాజకీయ పరిణామాలపై దగ్గుబాటి స్పందించారు. ‘అమరావతిని చంద్రబాబు కొత్త రాజధానిగా నిర్మించాలని అనుకుంటున్నారు. దీన్ని తప్పుపట్టలేం. కానీ దీనికోసం వెచ్చిస్తున్న సొమ్ము చూస్తేనే అందిరిలోనూ అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇందుకోసం పచ్చటి వేల పొలాలను తీసుకోవడం దారుణం. అవన్నీ మూడు పంటలు పండే భూములు. ఇంత విలువైన భూమిలో రాజధాని నిర్మించడం పిచ్చిపని’ అని అన్నారు.
అంతేకాదు దగ్గుబాటి ప్రతిపక్ష నేత జగన్ గురించి పలు సంచలన విషయాలు వెల్లడించారు.. ‘ప్రతిపక్ష నాయకుడుగా జగన్ రాటుదేలుతున్నాడు. తన పాదయాత్రతో జనం గుండెల్లో చెరగని ముద్రవేస్తున్నారు. జగన్ నిర్వహిస్తున్న మీటింగ్ లకు జనం పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. ఈ రెస్పాన్స్ చూశాక వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలవడం ఖాయంగా కనిపిస్తోంది’ అని దగ్గుబాటి అన్నాడు.
పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని.. జాతీయప్రాజెక్టుగా ప్రకటించడం, నిధులు తెచ్చి పూర్తి చేయడంలో బాబు ఫెయిల్యూర్ కనిపించిందని దగ్గుబాటి విమర్శించారు. ‘పోలవరం పూర్తయ్యితే ఏపీ సస్యశ్యామలం అవుతుందని కానీ దాన్ని పూర్తి చేయలేకపోయారు. కనీసం వట్టి సీమను అయినా పూర్తి చేశారు అదే సంతోషం.. దీంతోనైనాన కృష్ణ డెల్టాకు నీరివ్వండి’ అని ఆయన చెప్పారు.